బ్రేకింగ్: IPL 2024లో మ్యాచ్ లు రీ షెడ్యూల్! కారణం ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మ్యాచ్ లను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అందుకు గల కారణాలు ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మ్యాచ్ లను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అందుకు గల కారణాలు ఏంటంటే?

క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తూ ముందుకు సాగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సీజన్ ను ఇప్పటికే రెండు దఫాలుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ 17వ ఎడిషన్ లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరి మ్యాచ్ లను ఇలా రీ షెడ్యూల్ చేయడానికి కారణం ఏంటి? ఏఏ మ్యాచ్ లను చేశారు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ టోర్నీలోని రెండు మ్యాచ్ లను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రీరామనవమి వేడుకల కారణంగా తగిన భద్రత కల్పించలేమని పోలీసులు తెలియజేయడంతో.. ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ను ఒకరోజు ముందుకు జరిపారు. అంటే ఈ మ్యాచ్ ఏప్రిల్ 16న జరగనుంది. ఇక మరో పోరులో ఏప్రిల్ 16న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగాల్సిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఏప్రిల్ 17న జరగనుంది. ఈ రెండు మ్యాచ్ లను రీ షెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. మిగతా మ్యాచ్ ల్లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. మరి మ్యాచ్ ల రీ షెడ్యూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఒకప్పుడు చెత్త ప్లేయర్.. ఇప్పుడు కోహ్లీకే సవాల్ విసురుతూ..! పరాగ్ 2.O కథ తెలుసా?

Show comments