iDreamPost

ఒకప్పుడు చెత్త ప్లేయర్.. ఇప్పుడు కోహ్లీకే సవాల్ విసురుతూ..! పరాగ్ 2.O కథ తెలుసా?

  • Published Apr 02, 2024 | 3:22 PMUpdated Apr 02, 2024 | 3:22 PM

Riyan Parag, IPL 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ అనే కుర్రాడు విరాట్‌ కోహ్లీకే పోటీ ఇస్తున్నాడు. గతంలో ఓవర్‌ యాక్షన్‌గా స్టార్‌గా ట్రోలింగ్‌కు గురైన ఈ కుర్రాడు.. ఇప్పుడు బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఈ మార్పుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Riyan Parag, IPL 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ అనే కుర్రాడు విరాట్‌ కోహ్లీకే పోటీ ఇస్తున్నాడు. గతంలో ఓవర్‌ యాక్షన్‌గా స్టార్‌గా ట్రోలింగ్‌కు గురైన ఈ కుర్రాడు.. ఇప్పుడు బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఈ మార్పుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 02, 2024 | 3:22 PMUpdated Apr 02, 2024 | 3:22 PM
ఒకప్పుడు చెత్త ప్లేయర్.. ఇప్పుడు కోహ్లీకే సవాల్ విసురుతూ..! పరాగ్ 2.O కథ తెలుసా?

రియాన్‌ పరాగ్‌.. ఈ పేరు తెలియని భారత క్రికెట్‌ అభిమాని ఉండడు. అంటే.. ఈ సీజన్‌లో రాణిస్తున్నాడని పాపులార్‌ కాలేదు. మనోడికి అంతకు ముందే మంచి పాపులారిటీ ఉంది. కానీ, నెగిటివ్‌ పాపులారిటీ.. ఆట కంటే అతి ఎక్కువ చేసి.. ‘ఓవర్‌ యాక్షన్‌ స్టార్‌’, ‘యాటిట్యూడ్‌ స్టార్‌’గా పేరు తెచ్చుకున్నాడు. చాలా చిన్న వయసులోనే.. అంటే కేవలం 17 ఏళ్లకే ఐపీఎల్‌ లాంటి మెగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పరాగ్‌. అంత కంటే ముందే.. 14 ఏళ్ల వయసులోనే దేశవాళి క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అతి పిన్న వయసులో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన క్రికెటర్‌గా రియాన్‌ పరాగ్‌ రికార్డు క్రియేట్‌ చేశాడు. అయితే.. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. రాజస్థాన్‌ రాయల్స్‌ అతనికి చాలా అవకాశాలు ఇచ్చింది.

2019 ఐపీఎల్‌ వేలంలో రూ.20 లక్షల బేస్‌ ప్రైజ్‌కు పరాగ్‌ను కొనుగోలు చేసిన రాజస్థాన్‌.. మంచి టాలెంట్‌ ఉన్న కుర్రాడు, సానబెడితే.. భవిష్యత్తులో అద్భుతాలు చేస్తాడని, జట్టులో చోటిస్తూ.. కొనసాగించింది. చాలా చిన్న వయసులో వచ్చిన అవకాశాలతో పరాగ్‌కు ఏం అర్థం కాలేదో ఏమో కాని, కొన్ని పిల్ల చేష్టలతో ఓవర్‌ యాక్షన్‌ స్టార్‌గా అఖ్యాతిని మూటగట్టుకున్నాడు. సోషల్‌ మీడియాలో దారునమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. ప్రస్తుతం పరాగ్‌ వయసు 22 ఏళ్లు. 17 ఏళ్లకే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పరాగ్‌.. ఇప్పుడు తనలోని అసలైన ఆటను బయటికి తీస్తూ.. ఓ అద్భుతమైన ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు. ఇన్నేళ్లు.. చిల్లర మల్లర ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. గ్రౌండ్‌లో డాన్స్‌లు, ఆటగాళ్లతో గొడవలతో ఆట తక్కువ అతి ఎక్కువ అనే ట్యాగ్‌ను అంటించుకున్న పరాగ్‌.. ఈ సీజన్‌లో మాత్రం ఒక డిఫరెంట్‌ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు.

riyan parag

అందరితో తిట్టించుకున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు ఏకంగా విరాట్‌ కోహ్లీ నుంచే ఆరెంజ్‌ క్యాప్‌ లాగేసుకుంటూ.. పోటీ పడుతున్నాడు. అయితే.. ఇది అంత సాధారణంగా వచ్చిన మార్పు కాదు. వయసు పెరగడం వల్ల వచ్చిన మెచ్యూరిటీ కావొచ్చు కానీ, పరాగ్‌లో ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. తనలో మార్చుకోవాల్సిన విషయాలపై స్పెషల్‌ ఫోకస్‌ అంటూ ఎక్కడికో వెళ్లి ట్రైనింగ్‌ తీసుకోకుండా.. ఆటపైనే తన పూర్తి దృష్టి పెట్టాడు. తన క్యారెక్ట్‌ మారాలంటే.. డొమెస్టిక్‌ క్రికెటే సరైన మార్గం అని నమ్మాడు. దేశవాళి క్రికెట్‌లో అస్సాం తరుఫున ఆడుతూ.. అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. వరుస సెంచరీలోతో తనలోని అసలైన ఆటగాడిని తట్టి లేపాడు.

అవి కూడా 80 బంతుల్లో సెంచరీ, 70 బంతుల్లో సెంచరీలే. అలా టెస్ట్‌ క్రికెట్‌లో కూడా టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేస్తూ.. ముస్తక్‌ అలీ ట్రోఫీ లాంటి టీ20 టోర్నీల్లో సత్తా చాటుతూనే, రంజీల్లో కూడా అదే స్టైల్‌ కొనసాగించాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 29 బంతుల్లో 43, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 84(నాటౌట్‌), తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 54(నాటౌట్‌) పరుగులు చేసి.. దుమ్మురేపుతున్నాడు. పైగా అతను ఆడే షాట్లు చూసేందుకు రెండో కళ్లు సరిపోవడం లేదు. ఎంత చూడ చక్కగా ఆడుతున్నాడో అంటూ మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురపిస్తున్నారు.

పరాగ్‌ బ్యాటింగ్‌లో కానీ, అతని బిహేవియర్‌లో కానీ.. ఇంత మార్పు తీసుకొచ్చింది మాత్రం దేశవాళి క్రికెట్టే. జాతీయ జట్టులో చోటు కోసం, ఐపీఎల్‌లో రాణించడం కోసం దేశవాళి క్రికెట్‌ను నమ్ముకున్న పరాగ్‌ సూపర్‌ సక్సెస్‌ అవుతున్నాడు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో చూపించిన కన్సిస్టెన్సీని ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో ఛత్తీస్‌ఘడ్‌, కేరళ టీమ్స్‌పై సెంచరీలో చెలరేగాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో హైయొస్ట్‌ రన్స్‌ గెట్టర్‌గా ఉండి, ఆరెంజ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. చాలామంది డొమెస్టిక్‌ క్రికెట్‌కు దూరం అవుతూ.. ఫెయిల్‌ అవుతున్న క్రికెటర్లకు రియాన్‌ పరాగ్‌ కమ్‌బ్యాక్‌ ఓ గుణపాఠం లాంటిది. మరి ఈ పరాగ్‌ 2.ఓపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి