Somesekhar
కేకేఆర్ టీమ్ ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతోంది. అయితే ఈ సీజన్ లో ఇలా రాణించడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. బహుశా అదే మా సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చాడు అయ్యర్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
కేకేఆర్ టీమ్ ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతోంది. అయితే ఈ సీజన్ లో ఇలా రాణించడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. బహుశా అదే మా సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చాడు అయ్యర్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
KKR.. ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపే ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి.. అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే.. దర్జాగా ప్లే ఆఫ్ కు వెళ్తుంది. కేకేఆర్ ఇప్పుడున్న ఫామ్ లో అదంత పెద్దపనేం కాదు. అయితే తాజాగా లక్నోను వారి సొంతగడ్డపై 98 పరుగుల భారీ తేడాతో ఓడించింది కేకేఆర్. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ సక్సెస్ సీక్రెట్ బహుశా అదే కావొచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి కేకేఆర్ విజయ రహస్యం ఏంటి? తెలుసుకుందాం పదండి.
ఐపీఎల్ 2024 సీజన్ లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్. తాజాగా లక్నోపై భారీ విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్ టీమ్.. వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి.. ప్లే ఆఫ్ కు మరింత చేరువైంది. మరొక్క మ్యాచ్ గెలిస్తే.. కేకేఆర్ ప్లే ఆఫ్ కు వెళ్తుంది. అయితే కేకేఆర్ ఆడిన గత ఆరు మ్యాచ్ ల్లో ఓ విషయం రొటీన్ గా మారింది. బహుశా బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. ఆ రొటీన్ విషయమే మా విజయం రహస్యం కావొచ్చని చెప్పుకొచ్చాడు కేకేఆర్ కెప్టెన్.
లక్నోతో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఇక మాకు పవర్ ప్లేలో సాల్ట్-నరైన్ అద్బుతమైన మెరుపు ఆరంభం ఇచ్చారు. ఈ పిచ్ పై 200+ స్కోర్ చేస్తే చాలని నరైన్ అన్నాడు. కానీ అంతకంటే ఎక్కువే కొట్టాం. ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఫ్రీడమ్ ఇస్తే వారు సూపర్ సక్సెస్ అయ్యే ఛాన్స్ లు ఉంటాయి. కానీ అప్పుడప్పుడు వారు విఫలం అవుతూ ఉంటారు. మనమే సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలి. ఇక ఈ మ్యాచ్ లో మా బౌలర్లు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు వెళ్లి విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో మేం టాస్ ఓడిపోయాం.. కానీ మ్యాచ్ గెలిచాం. మీరు గమనిస్తే.. మేం ఆడిన గత ఆరు మ్యాచ్ ల్లో టాస్ ఓడిపోయాం. అందులో 4 విజయాలు సాధించాం. బహుశా మా సక్సెస్ సీక్రెట్ టాస్ ఓడిపోవడమే అనుకుంటా(నవ్వుతూ)” అంటూ చెప్పుకొచ్చాడు అయ్యర్. ఇక ఈ సీజన్ లో కేకేఆర్ అద్బుతంగా రాణిస్తోంది. ప్లేయర్లంతా సమష్టిగా రాణిస్తూ.. జట్టు విజయానికి తోడ్పడుతున్నారు. మరి టాస్ ఓడిపోవడం వల్లే మ్యాచ్ లు గెలుస్తున్నాం అన్న అయ్యర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.