RCB vs KKR: ఇలాగైతే కప్ కష్టమే! ఇది ఒక్కడి ఆట కాదు! టీమ్ గేమ్: గవాస్కర్

KKR చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో.. టీమిండియా మాజీ దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ ఒక్కడి ఆట కాదని, టీమ్ స్పోర్ట్స్ అంటూ పేర్కొన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

KKR చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో.. టీమిండియా మాజీ దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ ఒక్కడి ఆట కాదని, టీమ్ స్పోర్ట్స్ అంటూ పేర్కొన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ లో రెండో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు ఓడి, ఓ మ్యాచ్ లో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో చిత్తైంది ఆర్సీబీ. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఛాలెంజింగ్ నాక్ ఆడాడు. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకున్నా.. ఒంటరి పోరాటం చేశాడు. దీంతో ఆ స్కోర్ సాధ్యం అయ్యింది. ఇక విరాట్ ఇన్నింగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

సింగిల్ ప్లేయర్ గేమ్స్ తప్పితే.. మిగతా ఆటల్లో టీమ్ గేమ్ కంపల్సరి. ఒకే ఒక్క ప్లేయర్ పై ఆధారపడితే.. ఆ జట్టు కప్పు కొట్టడం అటుంచితే.. గెలవడమే కష్టం. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పరిస్థితి ఇలాగే తయ్యారైంది. క్రికెట్ లాంటి ఆటలో ఒక్క ప్లేయర్ ఆడితే మ్యాచ్ గెలవదు. టీమ్ లో ఉన్న అందరూ గొప్పగా రాణిస్తేనే విజయాలు దక్కుతాయి. ఇదే విషయాన్ని కేకేఆర్ తో మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత మరోసారి గుర్తు చేశాడు టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్. కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానీ అతడికి ఇతర ప్లేయర్ల నుంచి సహకారం లభించకపోవడంతో.. అతడు కూడా స్వేచ్చంగా బ్యాట్ ను ఝుళిపించలేకపోయాడు.

కాగా.. ఆర్సీబీ టోటల్ గా 182 రన్స్ చేయగా.. కోహ్లీ ఒక్కడే అందులో 83 పరుగులు చేశాడు. మిగతా ఆరుగులు ప్లేయర్లు కలిసి 99 రన్స్ చేశారు. ఇదే విషయంపై గవాస్కర్ మాట్లాడుతూ..”మీరే చెప్పండి కోహ్లీ ఒక్కడే ఒంటరిగి ఎన్ని సార్లని పోరాడతాడు? అతడికి ఇతర ప్లేయర్ల నుంచి సహకారం అందాలికదా? కేకేఆర్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీకి మరో ఆటగాడి నుంచి సహకారం అందితే.. కచ్చితంగా 83 రన్స్ కు బదులుగా 120 పరుగులు చేసేవాడే. క్రికెట్ టీమ్ గేమ్. ఒక్కడు ఆడే ఆట కాదు. ఈ రోజు విరాట్ కు మిగతా ప్లేయర్ల నుంచి సపోర్ట్ లభించలేదు” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేయగా.. ఆ టార్గెట్ ను 16.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది కేకేఆర్ టీమ్. మరి గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPLలో ఆ 4 టీమ్స్​ను తప్ప మిగతా జట్లను పట్టించుకోని ఫ్యాన్స్.. కారణం?

Show comments