IPL 2024: RCB ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్ చెప్పిన మాక్స్​వెల్.. ఇది భయ్యా డెడికేషన్ అంటే..!

  • Author singhj Published - 11:27 AM, Wed - 6 December 23

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మాక్స్​వెల్ శుభవార్త చెప్పాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మాక్స్​వెల్ శుభవార్త చెప్పాడు.

  • Author singhj Published - 11:27 AM, Wed - 6 December 23

వన్డే వరల్డ్‌ కప్ తర్వాత అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ మెగా లీగ్​కు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్లేయర్ల రిటెన్షన్ అంశంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అందులోనూ ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీమ్ మారుతున్నాడనే న్యూస్​ బాగా హైలైట్ అయింది. టైటాన్స్​కు ఒకసారి ఐపీఎల్ టైటిల్ అందించిన హార్దిక్.. మరోమారు రన్నరప్​గా నిలిపాడు. ఎంతో ఇష్టపడి అతడ్ని తీసుకుంది గుజరాత్. అలాంటప్పుడు పాండ్యాను వదిలేసుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. తనకు కెప్టెన్సీ పోస్ట్ ఇచ్చి ఇంతగా ఎంకరేజ్ చేసిన టైటాన్స్​ను హార్దిక్​ ఎందుకు వీడాలనుకుంటున్నాడనే క్వశ్చన్స్ కూడా అందరు అభిమానులకు వచ్చాయి.

ముందు నుంచి వస్తున్న గాసిప్స్, వార్తలు నిజమయ్యాయి. ప్లేయర్ల రిటెన్షన్​లో భాగంగా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తీసేసుకుంది. ఈ డీల్​లో భాగంగా గుజరాత్​కు ముంబై రూ.15 కోట్లు చెల్లించిందని క్రికెట్ వర్గాల సమాచారం. అలాగే అనధికారికంగా మరికొంత మొత్తాన్ని కూడా ఇవ్వనుందట. ఇందులో సగభాగం పాండ్యాకు కూడా ఇస్తారని వినిపిస్తోంది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మరికొన్నేళ్లలో రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతడి ప్లేసులో తదుపరి కెప్టెన్​గా హార్దిక్​కు బాధ్యతలు అప్పజెప్పాలనే ఉద్దేశంతోనే అతడ్ని టీమ్​లోకి తీసుకున్నారని అంటున్నారు. దీంతో చాన్నాళ్లుగా జట్టులోనే ఉంటూ అవకాశాలు వచ్చినా ఫ్రాంచైజీ మారకుండా ఉన్న తనకు అన్యాయం జరిగిందని మరో ముంబై ఆటగాడు జస్​ప్రీత్ బుమ్రా భావిస్తున్నాడని టాక్. తనను కాకుండా హార్దిక్​ను నెక్స్ట్ కెప్టెన్​గా ప్రొజెక్ట్ చేయడంపై అతడు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని గాసిప్స్ వస్తున్నాయి.

హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు డబ్బులు సరిపోకపోడంతో కామెరాన్​ గ్రీన్​ను వదులుకుంది ముంబై ఇండియన్స్. రూ.17 కోట్ల ఈ ప్లేయర్​ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇచ్చేసింది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్​వెల్, ఫాఫ్ డుప్లెసిస్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్లతో నిండిన ఆర్సీబీలోకి గ్రీన్ రావడంతో ఆ టీమ్ బ్యాటింగ్ మరింత పటిష్టంగా తయారైంది. మినీ వేలంలో పేసర్లను తీసుకోవడంపై బెంగళూరు ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. 140 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే మిచెల్ స్టార్క్​ను దక్కించుకోవాలని ఆర్సీబీ అనుకుంటోందని టాక్. ఇక, బెంగళూరు అభిమానులకు ఆ ఫ్రాంచైజీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్​వెల్ శుభవార్త చెప్పాడు. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం ఐపీఎల్​లో ఆడతానని అన్నాడు.

ఐపీఎల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన మాక్స్​వెల్.. ఇక నడవలేనని అనుకునే వరకు మెగా లీగ్​లో కంటిన్యూ అవుతానని చెప్పాడు. తన లైఫ్​లో ఐపీఎలే ఆఖరి క్రికెట్ టోర్నమెంట్ అవుతుందంటూ ఎమోషనల్ అయ్యాడు. తన కెరీర్​కు ఈ లీగ్ ఎంతో మేలు చేసిందన్నాడు. ఇక్కడ కలసిన ప్లేయర్లు, కోచ్​ల నుంచి ఎంతో నేర్చుకున్నానని మాక్సీ తెలిపాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఫాఫ్​ డుప్లెసిస్ వంటి టాప్ క్రికెటర్స్​తో భుజాలు రాసుకుంటూ గడిపిన మూమెంట్స్​ను తాను ఎప్పటికీ మర్చిపోనంటూ భావోద్వేగానికి గురయ్యాడీ స్టార్ ఆల్​రౌండర్. అతడి మాటలు విన్న ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. దీర్ఘకాలం పాటు లీగ్​లో ఆడతానని అతడు చెప్పకనే చెప్పాడని అంటున్నారు. ఇది భయ్యా అసలైన డెడికేషన్ అని చెబుతున్నారు. ఐపీఎల్​లో ఆడినంత కాలం అతడ్ని ఆర్సీబీ దూరం చేసుకోవద్దని ఫ్యాన్స్​ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఐపీఎల్​పై మాక్సీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దిగ్గజ క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. కరెన్సీ నోట్లపై ఫొటో ముద్రణ!

Show comments