iDreamPost

దిగ్గజ క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. కరెన్సీ నోట్లపై ఫొటో ముద్రణ!

  • Author Soma Sekhar Published - 07:47 AM, Wed - 6 December 23

ఓ దిగ్గజ క్రికెటర్ సాధించిన ఘనతలకు గుర్తుగా కెరెన్సీ నోటుపై ఆ క్రికెటర్ ఫొటో ముద్రించారు. మరి ఆ లెజెండ్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఓ దిగ్గజ క్రికెటర్ సాధించిన ఘనతలకు గుర్తుగా కెరెన్సీ నోటుపై ఆ క్రికెటర్ ఫొటో ముద్రించారు. మరి ఆ లెజెండ్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 07:47 AM, Wed - 6 December 23
దిగ్గజ క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. కరెన్సీ నోట్లపై ఫొటో ముద్రణ!

దిగ్గజ క్రికెటర్లు సాధించిన ఘనతలకు గుర్తుగా కొన్ని దేశాలు వారిని స్మరించుకుంటూ.. వారి పేరుపై కొన్ని అరుదైన చిహ్నాలను రూపొందిస్తూ ఉంటాయి. కొన్ని దేశాలు క్రికెటర్లకు విగ్రహాలు పెడితే.. మరికొన్ని కంట్రీలు తమ దేశంలో ఉన్నతమైన అవార్డులు వారిపేర ప్రకటిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఇప్పుడు చెప్పుకోబోయే వార్త మరో ఎత్తు. ఓ దిగ్గజ క్రికెటర్ సాధించిన ఘనతలకు గుర్తుగా కెరెన్సీ నోటుపై ఆ క్రికెటర్ ఫొటో ముద్రించారు. ఓ బ్యాంక్ ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ లెజెండ్ క్రికెటర్ కు గుర్తుగా కరెన్సీ నోటుపై అతని ఫొటో ముద్రించారు.

ఈస్టర్న్ కరేబియన్ సెంట్రల్ బ్యాంక్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ సర్ వీవీ రిచర్డ్స్ ఫొటోను $2 రూపాయాల కరెన్సీ నోటుపై ముద్రించింది. లెజెండరీ ప్లేయర్ గుర్తుగా ఈస్టర్న్ కరేబియన్ కంట్రీల్లో ఈ కరెన్సీ నోటు చలామనీలో ఉంటుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 6 నుంచి ఇది వాడుకలోకి వస్తుందని పేర్కొన్నారు. రిచర్డ్స్ పుట్టిన అంటిగ్వాలో ఈ స్మారక కరెన్సీని విడుదల చేశారు. ఈ అరుదైన ఘనత దక్కించుకున్న లెజెండ్ గా రిచర్డ్స్ చరిత్రకెక్కాడు.

ఈ విషయంపై రిచర్డ్స్ స్పందిస్తూ..”ఇలా గౌరవించబడటం ఏదో కలలా ఉంది. అందరికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు రిచర్డ్స్. ఇక అతడి ఫొటో కలిగిన తొలి కరెన్సీ నోటును తనకే అందించారు. చరిత్రలో ఎంతో మంది గ్గజాలు ఉన్నప్పటికీ.. ఇలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్న క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు రిచర్డ్స్. విండీస్ క్రికెట్ దశను మార్చిన వీరుడి అతడికి గొప్ప గుర్తింపు ఉంది. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 121 టెస్టు మ్యాచ్ ల్లో 8540 పరుగులు చేశాడు. అందులో 24 శతకాలు, 3 ద్విశతకాలు ఉన్నాయి. 187 వన్డేల్లో 6271 పరుగులు సాధించాడు. బౌలింగ్ లో టెస్టుల్లో 32, వన్డేల్లో 118 వికెట్లు సాధించాడు. మరి ఇలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్న రిచర్డ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి