Nidhan
లెజెండరీ క్రికెటర్ గౌతం గంభీర్ మొత్తానికి తాను అనుకున్నది సాధించాడు. అతడు దేని కోసమైతే కేకేఆర్‌లోకి వెళ్లాడో అది అతడికి దక్కింది.
లెజెండరీ క్రికెటర్ గౌతం గంభీర్ మొత్తానికి తాను అనుకున్నది సాధించాడు. అతడు దేని కోసమైతే కేకేఆర్‌లోకి వెళ్లాడో అది అతడికి దక్కింది.
Nidhan
భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 మీద పడింది. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ ఇంకో వారంలో మొదలుకానుంది. మ్యాచ్‌లకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాలు కూడా మొదలయ్యాయి. ఐపీఎల్ ఫీవర్‌తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఆటగాళ్లు కూడా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో కలిశారు. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్ని టీమ్స్ తమ ప్రణాళికల్లో మునిగిపోయాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ప్లానింగ్‌ను స్టార్ట్ చేసింది. ఆ జట్టు సన్నాహకాల్లో మరింత జోష్ నింపేందుకు మెంటార్ గౌతం గంభీర్ కోల్కతాలోకి ల్యాండ్ అయ్యాడు. అతడికి ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది.
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన గంభీర్‌ను రిసీవ్ చేసుకునేందుకు వందలాదిగా అభిమానులు తరలివచ్చారు. గౌతీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కేకేఆర్‌కు కప్పును అందించనప్పటి ఫొటోలతో కూడిన బ్యానర్లతో సందడి చేశారు. గంభీర్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సందడి చేశాడు. మాకు ఇంకో కప్ కావాలి గౌతీ అంటూ నినాదాలు చేశారు. లేడీ ఫ్యాన్స్ సందడితో ఎయిర్‌పోర్టు ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. దీంతో గంభీర్ అనుకున్నది సాధించినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నప్పుడు అతడికి అంతగా ఆదరణ దక్కలేదు. పైగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ-మ్యాంగో మ్యాన్ నవీనుల్ హక్ వివాదం వల్ల గౌతీపై వ్యతిరేకత పెరిగింది. అయితే గతంలో తమ జట్టుకు ట్రోఫీ అందించి సక్సెస్ రూట్లో నడిపిన హిస్టరీ ఉండటంతో.. గంభీర్‌ను వెనక్కి తెచ్చుకోవాలని భావించాడు ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుక్ ఖాన్.
గౌతం గంభీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా రావాలని కింగ్ ఖాన్ కోరాడు. దీంతో కేకేఆర్ కోసం రాజకీయాలను వద్దనుకున్నాడు గౌతీ. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పి క్రికెట్ మీద ఫుల్ ఫోకస్ చేయాలని భావించాడు. పైకి మెంటార్ పోస్ట్‌లో ఉన్నట్లే కనిపిస్తున్నా కోల్‌కతా టీమ్ మేనేజ్మెంట్లో గౌతీదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అని తెలుస్తోంది. అందుకే అతడు కేకేఆర్ కోసం ఈసారి ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాడట. అయితే డబ్బులు, బాధ్యతల కంటే కూడా అభిమానుల నుంచి వచ్చే ప్రేమకు గంభీర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అతడు కోరుకుంది తాజాగా దక్కింది. కోల్‌కతాకు వచ్చిన గంభీర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ వందలాదిగా తరలివచ్చారు. అతడికి ఊహించని రీతిలో స్వాగతం పలికారు. దీంతో లెజెండరీ బ్యాటర్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఇదే ఆదరణ సీజన్ మొత్తం చూపిస్తే గంభీర్ చేసిన దానికి పూర్తి ఫలితం దక్కినట్లే. అదే టైమ్‌లో కేకేఆర్ కప్ కొడితే షారుక్ కూడా సక్సెస్ అయినట్లు అవుతుంది. మరి.. గంభీర్ మెంటార్‌గా ఉన్న కేకేఆర్ ఈసారి కప్పు కొడుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: ఆసీస్‌పై హిస్టారికల్ విక్టరీ.. షాంపెయిన్తో సచిన్, ద్రవిడ్, గంగూలీ సందడి!
The Roar and Craze of Gautam Gambhir in Kolkata.
– The Legend, The Ultimate man of KKR…!!!!🙌 pic.twitter.com/R3Ua3EnNZe
— CricketMAN2 (@ImTanujSingh) March 14, 2024