iDreamPost
android-app
ios-app

Rishabh Pant: ధోనిని గుర్తు చేస్తూ.. ట్రేడ్ మార్క్ షాట్ ఆడిన పంత్! వీడియో వైరల్

  • Published Apr 27, 2024 | 7:38 PM Updated Updated Apr 27, 2024 | 7:38 PM

ముంబైతో జరిగిన మ్యాచ్ లో కూడా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తు చేస్తూ కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను చూసేయండి.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో కూడా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తు చేస్తూ కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను చూసేయండి.

  • Published Apr 27, 2024 | 7:38 PMUpdated Apr 27, 2024 | 7:38 PM
Rishabh Pant: ధోనిని గుర్తు చేస్తూ.. ట్రేడ్ మార్క్ షాట్ ఆడిన పంత్! వీడియో వైరల్

ప్రపంచ క్రికెట్ లో ఒక్కో క్రికెటర్ కు ఒక్కో ట్రేడ్ మార్క్ షాట్ ఉంటుంది. ఇక బౌలర్లకైతే తమ ట్రేడ్ మార్క్ బాల్ ఉంటుంది. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీలకు కవర్ డ్రైవ్, వీరేంద్ర సెహ్వాగ్ కు అప్పర్ కట్, ఎంఎస్ ధోనికి హెలికాప్టర్ షాట్ ఇలా ఒక్కో ప్లేయర్ కు ఒక్కో ట్రేడ్ మార్క్ షాట్ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కొంత మంది క్రికెటర్లు ఇంకో ప్లేయర్ ట్రేడ్ మార్క్ షాట్స్ ను ఆడుతుంటారు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో కూడా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తు చేస్తూ.. అతడి మార్క్ షాట్ అయిన హెలికాప్టర్ షాట్ ను ఆడాడు. ప్రస్తుతం ఆ సిక్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

రిషబ్ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్, కీపింగ్ లో దుమ్మురేపుతూ తాను కూడా టీ20 వరల్డ్ కప్ రేసులో ఉన్నానని చెప్పకనే చెబుతున్నాడు. ఇక తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జేక్ ఫ్రేజర్ 27 బంతుల్లో 84 పరుగుల సునామీ ఇన్నింగ్స్ కు తోడు.. ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. అభిషేక్ పోరెల్(36), షై హోప్(41), కెప్టెన్ రిషబ్ పంత్(29) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ 257 రన్స్ చేసింది.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ధోని ట్రేడ్ మార్క్ షాట్ అయిన హెలికాప్టర్ షాట్ ను ఆడాడు. ఈ షాట్ ఢిల్లీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో నమోదు అయ్యింది. నువాన్ తుషారా వేసిన ఈ ఓవర్ లో రెండో బంతిని ఫోర్ కొట్టిన పంత్.. 5వ బంతిని డీప్ స్క్వేయర్ లెగ్ దిశగా హెలికాప్టర్ షాట్ ఆడి సిక్సర్ బాదాడు. దీంతో గ్రౌండ్ మెుత్తం ఒక్కసారిగా హోరెత్తింది. ఈ హెలికాప్టర్ షాట్ ఎక్కువగా ధోని ఆడతాడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి షాట్ ను పంత్ ఈ మ్యాచ్ లో ఆడి.. ధోనిని గుర్తుకు తెచ్చాడు. ఇక ఈ సిక్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి పంత్ కొట్టిన ఈ షాట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet