iDreamPost
android-app
ios-app

MS Dhoni: రుతురాజ్ స్టన్నింగ్ సిక్స్.. ధోని రియాక్షన్ చూడాల్సిందే!

  • Published Apr 15, 2024 | 10:25 AM Updated Updated Apr 15, 2024 | 10:52 AM

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓ స్టన్నింగ్ సిక్సు కొట్టాడు. ఈ సిక్సుకు ధోని ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓ స్టన్నింగ్ సిక్సు కొట్టాడు. ఈ సిక్సుకు ధోని ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

MS Dhoni: రుతురాజ్ స్టన్నింగ్ సిక్స్.. ధోని రియాక్షన్ చూడాల్సిందే!

ఐపీఎల్ అంటేనే సిక్సులు, ఫోర్లు. ఎవ్వరూ ఊహించని రీతిలో బ్యాటర్లు బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తూ ఉంటారు. ఇక ఆ షాట్స్ ను చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టాల్సిందే. ఇక తమ ఆటగాళ్లతో పాటుగా ప్రత్యర్థి ప్లేయర్లు కొట్టే కొన్ని అరుదైన షాట్స్ కు డగౌట్ లో ఉన్న ఆటగాళ్లు ఇచ్చే రియాక్షన్స్ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన స్టన్నింగ్స్ సిక్స్ కు ఆ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు రుతురాజ్ గైక్వాడ్. 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో గైక్వాడ్ కొట్టిన ఓ సిక్సర్ కు చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సీన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో చోటుచేసుకుంది. ఆకాశ్ మధ్వాల్ వేసిన ఈ ఓవర్ ఐదో బంతిని గైక్వాడ్ నేరుగా స్టాండ్స్ లోకి పంపాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతిని కాస్త ముందుకు జరిగి గైక్వాడ్ స్లైస్ షాట్ ఓవర్ డీప్ పాయింట్ దిశగా సిక్సర్ బాదిన విధానం చూసితీరాల్సిందే. ఇక రుతురాజ్ కొట్టిన ఈ స్టన్నింగ్ సిక్సర్ చూసిన ధోని.. ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారింది. అలా ఎలా కొట్టావ్ బ్రో అన్నట్లుగా ధోని స్పందించాడు.

ఇక ఈ మ్యాచ్ ద్వారా రుతురాజ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇది కోహ్లీ, రోహిత్ లకు కూడా సాధ్యపడలేదు. ఇక ఈ మ్యాచ్ లో చివరల్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోని.. తన ధనాధన్ ఇన్నింగ్స్ తో చెన్నైకి భారీ స్కోర్ అందించడంతో పాటుగా విజయాన్ని కూడా సాధించిపెట్టాడు. హార్దిక్ వేసిన ఓవర్లో 3 సిక్సులు బాది, కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేసి.. మరోసారి తనలో ఉన్న ఫినిషర్ ను అభిమానులకు చూపించాడు. మరి రుతురాజ్ స్టన్నింగ్ సిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.