Nidhan
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ఆంథమ్ వచ్చేసింది. సరిగ్గా సీజన్ ఫస్ట్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు దీన్ని సీఎస్కే రిలీజ్ చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ఆంథమ్ వచ్చేసింది. సరిగ్గా సీజన్ ఫస్ట్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు దీన్ని సీఎస్కే రిలీజ్ చేసింది.
Nidhan
ఐపీఎల్ నయా సీజన్ స్టార్ట్ అవడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫస్ట్ మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అయిపోయాయి. రుతురాజ్ సేనను ఎంకరేజ్ చేసేందుకు ఎల్లో ఆర్మీ సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ స్టేడియానికి ఆడియెన్స్ భారీగా తరలివస్తున్నారు. కెప్టెన్ మారడంతో ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఎలా పెర్ఫార్మ్ చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో కొత్త జెర్సీలో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్న ఆర్సీబీ సీజన్‌ను ఎలా స్టార్ట్ చేస్తుందనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ తరుణంలో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు సీఎస్కే తమ కొత్త ఆంథమ్‌ను రిలీజ్ చేసింది.
సీఎస్కే ఆంథమ్ వచ్చేసింది. ఐపీఎల్లో ఎన్ని టీమ్స్ ఉన్నా చెన్నై ఆంథమ్‌కు మంచి క్రేజ్ ఉంది. ‘విజిల్ పొడు’ పేరుతో ఆ జట్టు ఆటగాళ్ల గురించి చెబుతూ సాగే ఈ పాటను మిగతా టీమ్స్ ఫ్యాన్స్ కూడా ఇష్టపడతారు. సాంగ్‌లో ఉండే జోష్, ఆటగాళ్ల డాన్సులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా సీఎస్కే ఆంథమ్ మీద అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఈ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేసింది చెన్నై. స్టార్ట్ ది విజిల్స్ అంటూ ధోని చెప్పే డైలాగ్‌తో ఈ సాంగ్ మొదలవుతుంది. ‘చెన్నై సూపర్ కింగ్స్‌కు పెరియ విజిల్ అడింగ’ అంటూ మాస్ బీట్తో సాగే ఈ పాట ఆఖరి వరకు అదే జోష్‌తో ఉంటుంది. ఈ సాంగ్‌లోని ఫస్ట్ ఫ్రేమ్‌లో కొత్త కెప్టెన్ రుతురాజ్, పాత సారథి ఎంఎస్ ధోని మెరిశారు.
సీఎస్కే కొత్త ఆంథమ్‌లో మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర సహా యంగ్ ప్లేయర్స్ కూడా సందడి చేశారు. నయా కెప్టెన్ రుతురాజ్ కూడా సాంగ్‌లో చాలా చోట్ల కనిపించాడు. అయితే ఆంథమ్‌లో మెయిన్ హైలైట్ మాత్రం ధోని అనే చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సాంగ్ మొత్తం అతడే ఎక్కువగా కనిపించాడు. డైలాగ్స్ చెబుతూ, విజిల్స్ వేస్తూ, స్టైల్‌గా నడుస్తూ, షాట్లు కొడుతూ అతడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. పాట అయిపోతుండగా ఆఖర్లో హెలికాప్టర్ షాట్‌తో మరో షాక్ ఇచ్చాడు మాహీ. సీఎస్కే ఆంథమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ పాట సూపర్బ్‌గా ఉందని అంటున్నారు. సాంగ్‌లో ధోనీని చూపించిన తీరు అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సీఎస్కే కొత్త ఆంథమ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
CSK ANTHEM FOR IPL 2024..!!!! 🔥pic.twitter.com/TN26KdrVPT
— Johns. (@CricCrazyJohns) March 22, 2024