Somesekhar
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అవకాశం ఉన్నాగానీ మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ కు మాత్రం దిగలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ధోని బ్యాటింగ్ కు రాకపోవడానికి కారణం వెల్లడించాడు సీఎస్కే కోచ్ మైక్ హస్సీ.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అవకాశం ఉన్నాగానీ మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ కు మాత్రం దిగలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ధోని బ్యాటింగ్ కు రాకపోవడానికి కారణం వెల్లడించాడు సీఎస్కే కోచ్ మైక్ హస్సీ.
Somesekhar
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ..పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీని తాజాగా గుజరాత్ ను ఓడించింది చెన్నై టీమ్. ఈ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు ఆటగాళ్లు. దీంతో గెలుపుల విషయంలో హ్యాపీగా ఉన్న సీఎస్కే ఫ్యాన్స్.. ఒక్క విషయంలో మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అదే ధోని బ్యాటింగ్ కు దిగకపోవడం. రెండు మ్యాచ్ ల్లో ధోని క్రీజ్ లోకి అడుగుపెట్టలేదు. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించాడు చెన్నై కోచ్ మైక్ హస్సీ. ఆ వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 2024లో మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ చూడాలని కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చెన్నై రెండు మ్యాచ్ లు ఆడింది. కానీ ఈ రెండు మ్యాచ్ ల్లో ధోని బ్యాటింగ్ కు దిగలేదు. ఆర్సీబీతో జరిగిన పోరులో ధోని క్రీజ్ లోకి వచ్చే అవకాశం దక్కలేదు. అయితే గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం అవకాశం ఉన్నాగానీ.. మైదానంలోకి దిగలేదు. దానికి కారణం ఏంటి? అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు చెన్నై టీమ్ వన్ ఆఫ్ ది కోచ్ మైక్ హస్సీ.
మైక్ హస్సీ మాట్లాడుతూ..”ధోని మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇది అతడి కీపింగ్ చూస్తేనే అర్ధమవుతుంది. రెండు మ్యాచ్ లో అద్భుతమైన కీపింగ్ తో తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే మేం ఇంపాక్ట్ రూల్ ను యూజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేశాం. ఈ నిర్ణయం మా హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచనల మేరకే చేశాం. మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్ది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కీలకమవుతుంది. ఇలాంటి సమయంలో బ్యాటర్ లేదా బౌలర్ అవసరమైతే.. అప్పుడు ఈ రూల్ ను ఉపయోగించుకోవాలని మేం భావించాం. దీంతో పాటుగా మా బ్యాటింగ్ ఆర్డర్ బలాన్ని పరీక్షించుకున్నాం. అందుకే ధోనిని 8వ నంబర్ లో బ్యాటింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాం. గుజరాత్ తో మ్యాచ్ లో సమీర్ రిజ్వీ, జడేజాలు ముందుగా బ్యాటింగ్ కు వచ్చారు” అని ధోని బ్యాటింగ్ కు దిగకపోవడానికి కారణం చెప్పుకొచ్చాడు మైక్ హస్సీ. దీంతో నెక్ట్స్ మ్యాచ్ లో నైనా ధోనిని బ్యాటింగ్ చూస్తామో? లేదో? అని తెగ ఫీలైపోతున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: IPL 2024: IPLల్లో పూర్తి డామినేషన్.. సరికొత్త చరిత్ర సృష్టించిన CSK!