iDreamPost
android-app
ios-app

IPL 2024: ఒకే టీమ్​ ప్లేయర్లను నమ్ముకున్న CSK.. ముంచుతారో? తేల్చుతారో?

  • Published Dec 19, 2023 | 4:37 PM Updated Updated Dec 19, 2023 | 4:37 PM

ఐపీఎల్ లో ఇతర జట్ల కంటే వెరైటీగా చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచిస్తూ.. ముందుకు సాగుతోంది. ఒకే టీమ్ కు చెందిన ఐదుగురు ఆటగాళ్లను చెన్నై నమ్ముకుంది. మరి ఆ ప్లేయర్లు ఎవరు? CSKని ముంచుతారో? తేల్చుతారో? ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ లో ఇతర జట్ల కంటే వెరైటీగా చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచిస్తూ.. ముందుకు సాగుతోంది. ఒకే టీమ్ కు చెందిన ఐదుగురు ఆటగాళ్లను చెన్నై నమ్ముకుంది. మరి ఆ ప్లేయర్లు ఎవరు? CSKని ముంచుతారో? తేల్చుతారో? ఇప్పుడు చూద్దాం.

IPL 2024: ఒకే టీమ్​ ప్లేయర్లను నమ్ముకున్న CSK.. ముంచుతారో? తేల్చుతారో?

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో ఈ జట్టుకు ఉన్న క్రేజ్ మరే ఇతర జట్లకు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ వేలంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది చెన్నై. ఇతర జట్లలో ఉన్నప్పుడు రాణించని ఆటగాళ్లందరు చెన్నై టీమ్ లోకి రావడంతోనే తమ బ్యాట్ కు పనిచెబుతారు. ఏదో పూనకం వచ్చినట్లు ఆడుతారు. ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ఆ ప్లేయర్లను అలా తీర్చిదిద్దుతాడు. అయితే ఇతర జట్ల కంటే వెరైటీగా చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచిస్తూ.. ముందుకు సాగుతోంది. ఒకే టీమ్ కు చెందిన ఐదుగురు ఆటగాళ్లను చెన్నై నమ్ముకుంది. మరి ఆ ప్లేయర్లు ఎవరు? CSKని ముంచుతారో? తేల్చుతారో? ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ వేలంలో స్టార్ ఆటగాళ్ల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చుపెట్టడానికి రెడీగా ఉంటాయి ఫ్రాంచైజీలు. ఇక ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో ఒక్కో ఆటగాడు ఊహించని ధర పలుకుతూ.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. తాజాగా జరుగుతున్న వేలంలో ప్యాట్ కమ్మిన్స్ ను కళ్లు చెదిరే దక్కించుకుని అందరిని షాక్ కు గురిచేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. అతడిని ఏకంగా రూ. 20.50 కోట్లకు దక్కించుకుంది. ఈ ధర ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం.

ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ హీరో, న్యూజిలాండ్ నయా సంచలనం రచిన్ రవీంద్ర కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా రచిన్ ను కేవలం రూ.1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. బేస్ ధర రూ.50 లక్షలతో అతడు వేలంలోకి వచ్చాడు. చెన్నైతో ఢిల్లీ ఫ్రాంచైజీ పోటీ పడినా రచిన్ ను చివరికి ధోని టీమ్ దక్కించుంది. ఇక మరో కివీస్ ప్లేయర్ డార్లి మిచెల్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఇతడి కోసం చెన్నై ఏకంగా రూ.14 కోట్లు వెచ్చించింది. వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు సాధించిన ఈ డాషింగ్ కివీస్ ప్లేయర్ కోసం పంజాబ్, ఢిల్లీలు తీవ్రంగా పోటీపడ్డాయి. కానీ చివరికి అతడు చెన్నై సొంతమైయ్యాడు. కేవలం రూ. 75 లక్షలకే 2022 వేలంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతడిని దక్కించుకుంది. కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. రూ. కోటి బేస్ ప్రైస్ తో గతేడాది బరిలోకి వచ్చాడు డార్లి మిచెల్ కానీ అమ్ముడుపోలేదు.

కాగా.. ఈ వరల్డ్ కప్ లో అద్బుత ప్రదర్శన చూపించిన మిచెల్ ను భారీ ధరకు చెన్నై దక్కించుకుని అందరికి షాకిచ్చింది. ఇదిలా ఉండగా.. చెన్నై టీమ్ లో కివీస్ ప్లేయర్ల సంఖ్య 5కు చేరుకుంది. ఇప్పటికే ఆ టీమ్ లో డేవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్ లు, స్టీఫెన్ ప్లెమింగ్(కోచ్)గా సేవలు అందిస్తున్నారు. ఇక తాజాగా జరిగిన వేలంలో వరల్డ్ కప్ హీరోలు రచిన్ రవీంద్ర, డార్లి మిచెల్ ను సొంతం చేసుకుంది చెన్నై. దీంతో ఆ జట్టులో కీవీస్ ప్లేవర్ ఎక్కువైంది. మరి ఇంత మంది న్యూజిలాండ్ ప్లేయర్లకు పెద్దపీట వేస్తున్న చెన్నైను చివరికి ఆ ప్లేయర్లు ఏం చేస్తారో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2024 ఐపీఎల్ లో చెన్నై టీమ్ ను ముంచుతారో? తేల్చుతారో అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి చెన్నై జట్టులో కివీస్ ప్లేవర్ ఎక్కువ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.