Nidhan
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఎవరూ ఊహించని విధంగా అతడ్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ భారీ ధరకు దక్కించుకుంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఎవరూ ఊహించని విధంగా అతడ్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ భారీ ధరకు దక్కించుకుంది.
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 ఆక్షన్ ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. ముందు నుంచీ అనుకున్నట్లే కొందరు ప్లేయర్లు మంచి ధరకే అమ్ముడుపోగా.. మరికొందరు ఎవరూ ఊహించని విధంగా జాక్‌పాట్ కొట్టారు. ఈసారి వేలంలో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఓ సంచలనం నమోదైంది. ఒక స్టార్ ప్లేయర్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతడే ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్. ఈ స్పీడ్‌స్టర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఒక్కో జట్టు ధర పెంచుకుంటూ పోవడంతో ఈసారి రికార్డు బ్రేక్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే అంత పోటీలోనూ చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఏకంగా రూ.20.50 కోట్ల భారీ ధరకు ఆసీస్ పేసర్‌ను దక్కించుకుంది ఎస్ఆర్హెచ్.
16 ఏళ్ల ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా కమిన్స్ రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఈ పేసర్‌ను తీసుకోవడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. టీమ్‌లో నిఖార్సయిన ఓపెనర్‌తో పాటు సాలిడ్ పేస్ బౌలర్ అవసరం ఉంది. దీంతో ఆక్షన్ స్టార్టింగ్ నుంచి ఎస్ఆర్హెచ్ వ్యూహాత్మకంగా, దూకుడుగా వ్యవహరించింది. ఇటీవల కాలంలో ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ భారీ స్కోర్లతో దుమ్మురేపుతున్న ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సొంతం చేసుకుంది. అతడి కోసం రూ.6.80 కోట్లు ఖర్చు పెట్టింది ఎస్ఆర్హెచ్. హెడ్ రాకతో టీమ్ ఓపెనింగ్ కష్టాలు తీరనున్నాయి. అతడ్ని కొనుకున్నాక హైదరాబాద్ దగ్గర ఇంకా రూ.27 కోట్లు ఉండటంతో కమిన్స్ మీద ఫోకస్ చేసింది. ఇక్కడే కావ్య పాప మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. అతడు భారీ ధరకు అమ్ముడుపోతాడని అందరికీ తెలుసు.
కమిన్స్ కోసం ఎస్ఆర్హెచ్ ఇంత ఖర్చు పెడుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతడి కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.20.25 కోట్ల వరకు బిడ్డింగ్ చేసింది. కానీ చివరికి ఎస్ఆర్హెచ్ అతడ్ని దక్కించుకుంది. ఇక, ఈ ఏడాది కమిన్స్‌కు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకుంటే ఈ సంవత్సరం అతడు మూడు అఛీవ్మెంట్స్ సాధించాడు. తొలుత ఆసీస్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ అందించిన కమిన్స్.. ఇటీవల వన్డే వరల్డ్ కప్ కూడా సాధించి పెట్టాడు. ఇప్పుడు ఐపీఎల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్‌గానూ నిలిచి మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏ రకంగా చూసుకున్నా ఈ ఏడాది అతడికి డ్రీమ్ ఇయర్ అనే చెప్పాలి. మరి.. కమిన్స్ కోసం ఎస్ఆర్హెచ్ ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sachin Tendulkar: గోల్డెన్ డక్ నుంచి గోల్డెన్ బ్యాటర్ వరకు.. సచిన్ జర్నీ మొదలైంది ఈ రోజే..!
Pat Cummins sold to SRH at 20.50cr. pic.twitter.com/OtUgjlKmQx
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
– Pat Cummins
– Travis Head
– Aiden Markram
– Heinrich Klaasen
– Glenn Phillips
– Marco Jansen
– Wanindu Hasaranga
– Fazalhaq FarooqiOverseas players of SRH in IPL 2024…!!!! pic.twitter.com/rJE6ibv2cw
— Johns. (@CricCrazyJohns) December 19, 2023