Aman Sehrawat: ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం.. రెజ్లింగ్ లో తొలి పతకం అందించిన అమన్!

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యంతో అదరగొట్టాడు. దాంతో ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో ఇండియాకు తొలి పతకం అందించి హీరోగా నిలిచాడు.

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యంతో అదరగొట్టాడు. దాంతో ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో ఇండియాకు తొలి పతకం అందించి హీరోగా నిలిచాడు.

పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో భారత్ కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. దాంతో రెజ్లింగ్ విభాగంలో పతకం ఆశలు ఆవిరి అయ్యాయి. అయితే భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించి భారత్ కల నెరవేర్చాడు. దాంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 6 కు చేరుకుంది.

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో భారత కుర్రాడు అమన్ సెహ్రావత్ కాంస్యంతో మెరిశాడు. కాంస్య పోరులో ఫ్యూర్టోరికాకు చెందిన డారియన్ క్రజ్ పై 13-5తో ఘన విజయం సాధించాడు. ఆది నుంచి అతడిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు అమన్. ఇక ఈ పతకంతో ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో తొలి పతకం అందించి చరిత్ర సృష్టించాడు. అదీకాక ఒలింపిక్స్ లో భారత్ తరఫున మెడల్ సాధించిన అత్యంతపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు అమన్.

కాగా.. ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్ లో భారత్ కు ఇది 8వ పతకం. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. కాంస్యం సాధించిన అమన్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుందని, పతకం సాధించాలన్న కృషి, పట్టుదల అతడిలో స్పష్టంగా కనించాయని ప్రశంసించారు. మరి రెజ్లింగ్ లో అమన్ భారత్ కు పతకం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments