iDreamPost

వీడియో: కోహ్లీ చెప్పింది నిజమే.. రోహిత్ కు మతిమరుపు!

  • Author Soma Sekhar Published - 04:00 PM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 04:00 PM, Mon - 18 September 23
వీడియో: కోహ్లీ చెప్పింది నిజమే.. రోహిత్ కు మతిమరుపు!

ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ధాటికి 50 పరుగులకే కుప్పకూలింది లంక. అనంతరం 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టీమిండియా ఈ చిరు లక్ష్యాన్ని ఛేదించింది. అనంతరం టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లందరూ తమ తమ లగేజీతో హోటల్ రూమ్ నుంచి బస్సులోకి ఎక్కారు. కానీ ఒక్క రోహిత్ మాత్రమే బస్సు ఫుడ్ బోర్డ్ దగ్గర అయోమయంగా చూస్తూ కనిపించాడు. మిగతా టీమిండియా ప్లేయర్లు ఏం జరిగిందా? అని ఆత్రుతగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్టాఫ్ సభ్యుడొకరు వచ్చి.. రోహిత్ చేతికి ఒకటి అందించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారిగా రోహిత్ ను ఆటపట్టించారు. రోహిత్ గురించి కోహ్లీ 2017లో చెప్పింది నిజమే అంటూ గుర్తు చేసుకున్నారు.

అది 2017 విరాట్ కోహ్లీ ఒక ప్రెస్ మీట్ లో ఈ విధంగా మాట్లాడాడు. ” రోహిత్ శర్మ లాంటి మతిమరుపు ఉన్న వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. అతడి వస్తువులను హోటల్ రూమ్ లో మరచిపోతూ ఉంటాడు. ఐప్యాడ్లు, ఐఫోన్లు చివరికి పాస్ పోర్ట్ కూడా మర్చిపోతాడు” అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా కోహ్లీ చెప్పిన మాటలు నిజమని రుజువు అయ్యాయి. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి పయనమైయ్యారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లందరూ తమ బ్యాగులతో వచ్చి బస్సులో కూర్చున్నారు.

ఒక్క రోహిత్ మాత్రం ఏదో మర్చిపోయి.. ఫుబ్ బోర్డ్ దగ్గర నిలబడ్డాడు. ఏంటా అని చూస్తే.. రోహిత్ తన పాస్ పోర్ట్ ను రూమ్ లో మర్చిపోయాడు. దీంతో సపోర్ట్ స్టాఫ్ సభ్యుడిని పిలిచి తన పాస్ పోర్ట్ తీసుకురమ్మన్నాడు. ఇదంతా చూసిన టీమిండియా సహచర ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుతూ.. రోహిత్ ను ఆటపట్టించారు. పాస్ పోర్ట్ తెచ్చి ఇచ్చే దాక రోహిత్ అక్కడే నిల్చున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదీకాక గతంలో కోహ్లీ మాట్లాడిన వీడియోను కూడా గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. రోహిత్ భాయ్ నీకు నిజంగానే మతిమరుపు ఉన్నట్లుంది. కోహ్లీ చెప్పింది నిజమే. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి