Gaza: గాజాలో ఐక్యరాజ్య సమితి వాహనంపై దాడి! ఇండియన్‌ మృతి

Gaza, Israel Attack, UNO: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధం.. తాజాగా ఓ భారతీయుడిని బలతీసుకుంది. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Gaza, Israel Attack, UNO: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధం.. తాజాగా ఓ భారతీయుడిని బలతీసుకుంది. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం ప్రపంచాన్ని ఈ యుద్ధం భయపెడుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం చిలికిచిలికి గాలి వానలా మారి.. ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అని పెద్ద దేశాలు కూడా భయపడుతున్నాయి. అయినా కూడా ఇజ్రాయెల్‌ ఎక్కడా తగ్గడం లేదు. గాజాపై విచక్షణా రహితంగా దాడికి తెగబడుతోంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికాతో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి, హెచ్చరించినా.. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు.

రఫాలో పాలస్తీయన్‌ ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌క్లేవ్‌లోని 11, ఇతర పరిసరాలను ఖాళీ చేయాలని బలవంతం చేస్తోంది. ఈ మేరకు శనివారం ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గాజా నగరానికి పశ్చిమానా ఉన్న ఆశ్రయాలకు వెళ్లాలని సూచించారు. రఫాలో భారీ దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయన ఈ ప్రకటన చేసిన తర్వాత.. ఓ దాడి జరిగింది. ఐక్యరాజ్య సమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడి వాహనంపై ఈ దాడి జరిగింది.

దాడిలో భారతీయుడు మృతి చెందారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలైన తర్వాత ఐరాసలో పనిచేస్తున్న అంతర్జాతీయ సిబ్బందిలో సంభవించిన తొలి మరణం ఇదే అని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన ఇండియన్‌ యూఎన్‌లోని భద్రత, రక్షణ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుడి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఆయన గతంలో భారత సైన్యంలో కూడా పనిచేసినట్లు సమాచారం. రఫాలోని యురోపియన్‌ ఆస్పత్రికి వెళ్తుండగా.. వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో డీఎస్‌ఎస్‌ సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ డిమాండ్‌ చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.:

Show comments