iDreamPost
android-app
ios-app

ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించిన మామాస్ మిలిటెంట్లు

ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించిన మామాస్ మిలిటెంట్లు

ఆధిపత్యం కోసం రెండు దేశాలు ఎప్పుడూ యుద్దం చేసుకుంటుంటాయి. ఆ దేశాల్లో ముందు వరుసలో ఉంటాయి ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాలు. ఓ భూభాగం విషయంలో ఈ రెండు దేశాల మధ్య పోరు కొన్ని వందల సంవత్సరాల నుండి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సరిహద్దు ప్రాంతమైన గాజాలో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే ఉంటుంది. ఇరు దేశాలు.. రాకెట్ల దాడి, కాల్పులతో హింసను సృష్టిస్తాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా.. అగ్రరాజ్యం అమెరికా కలగజేసుకుని, కాల్పుల విరమణకు ఉపక్రమించాలని పిలుపునిచ్చా.. ఈ దేశాలు మాత్రం పోరుకే సై అంటున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

గాజాలో ప్రస్తుతం పాలస్తీనియన్ తీవ్ర వాద సంస్థ హమాస్ మిలిటెంట్ల పాలనలో ఉంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి బలౌతున్న ప్రాంతం ఇదే. హమాస్ మిలిలెంట్ నాయకులను టార్గెట్ చేస్తూ గతంలో ఇజ్రాయెల్ రాకెట్ దాడులు ప్రయోగించింది. అలాగే గాజాను వేదికగా చేసుకుని హమాస్ మిలిటెంట్స్ కూడా ఇజ్రాయెల్‌పై కాల్పులకు తెగబడుతుంటారు. నిత్యం యుద్ద వాతావరణం ఉండే గాజా ఇప్పుడు మరోసారి రణరంగంగా మారింది. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్స్ రాకెట్ల వర్షం కురిపించారు.  20 నిమిషాల్లోనే సుమారు 5 వేల రాకెట్లు ఇజ్రాయెల్ వైపు దూసకెళ్లాయి. దీంతో ఎమర్జెనీ ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు .

గాజా సరిహద్దులో 80 కిలోమీటర్ల దూరం మేర ‘స్టేట్ ఆఫ్ వార్’ కింద ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. హమాస్ మిలిటెంట్స్ దేశంలోకి చొరబడటంపై ఆ దేశ రక్షణ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. నగరమంతా సైరన్లు మోగించి.. ప్రజలను అలర్డ్ చేశాయి. గాజా స్ట్రిప్ పరిసర ప్రాంతంలోని నివాసితులు తమ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో భద్రతా దళాధిపతుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. హమాస్ తన చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించింది. దీంతో యుద్దానికి సిద్ధం అయ్యేందుకు ఇజ్రాయెల్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియనేలేదు కానీ మరో భారీ హింస చెలరేగుతోంది.