iDreamPost
android-app
ios-app

వీడియో: ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్ల చూసి మనోళ్లు చూడండి ఏం చేశారో?

  • Published Jul 01, 2024 | 5:20 PM Updated Updated Jul 01, 2024 | 5:20 PM

South Africa, T20 World Cup 2024, Final, IND vs SA: టీమిండియాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిపోయి.. బాధలో ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్లతో భారత క్రికెట్‌ అభిమానులు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు చూద్దాం..

South Africa, T20 World Cup 2024, Final, IND vs SA: టీమిండియాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిపోయి.. బాధలో ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్లతో భారత క్రికెట్‌ అభిమానులు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 01, 2024 | 5:20 PMUpdated Jul 01, 2024 | 5:20 PM
వీడియో: ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్ల చూసి మనోళ్లు చూడండి ఏం చేశారో?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను టీమిండియా గెలవడంతో భారత క్రికెట్‌ అభిమానులంతా ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఇక భారత క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల సంతోషానికి హద్దులేదు. ఆనందంతో పాటు భావోద్వేగానికి గురవుతూ.. ఇంకా ఆ వైబ్స్‌లోనే ఉన్నారు. వరల్డ్‌ కప్‌ గెలిచిన సంతోషంలో మనం ఉంటే.. మరోవైపు సౌతాఫ్రికా క్రికెటర్లు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఓ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కు చేరుకున్న ఆ జట్టు ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలలో, ఎన్నో ఆశలతో ఫైనల్‌ బరిలోకి దిగింది.

టాస్‌ ఓడిపోయినా.. బౌలింగ్‌ చేస్తూ.. రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను వెంటవెంటనే అవుట్‌ చేసి.. మ్యాచ్‌పై పట్టుసాధించారు. విరాట్‌ కోహ్లీ నిలబడి, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేతో మంచి భాగస్వామ్యాలు నమోదు చేయకపోయి ఉంటే మ్యాచ్‌పై సౌతాఫ్రికా మరింత పట్టుసాధించేది. మొత్తంగా టీమిండియాను 176 పరుగులకే కట్టడి చేసిన సౌతాఫ్రికా.. మ్యాచ్‌ను ఆల్‌మోస్ట్‌ గెలిచేసింది. 15 ఓవర్లలోనే 146 పరుగులు కొట్టేసింది. క్వింటన్‌ డికాక్‌ ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు.. ఓ మూడు వికెట్లు త్వరగానే పడినా.. క్లాసెన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా విజయం లాంఛనమే అనుకున్నారు అంతా.

ఎందుకంటే.. 30 బంతుల్లో కేవలం 30 పరుగులు చేస్తే చాలా సౌతాఫ్రికా మొట్టమొదటి కప్పు గెలుస్తుంది. కానీ, అక్కడి నుంచి బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అర్షదీప్‌ సింగ్‌ అద్భుతమే చేసి.. టీమిండియాను గెలిపించారు. విజయం ముంగిట వచ్చిన సౌతాఫ్రికా 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి 30 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసింది. తొలిసారి ప్రపంచ కప్పును ముద్దాడుదాం అనుకున్న సౌతాఫ్రికా దాదాపు మ్యాచ్‌ను గెలిచి ఓడిపోయింది. దీంతో.. ఆ జట్టు ఆటగాళ్ల కళ్లు నీళ్లతో నిండిపోయాయి. బరువెక్కిన హృదయాలతో పెవిలియన్‌ చేరారు. అయితే.. స్టేడియం నుంచి ఎంతో బాధతో హోటల్‌కు బయలుదేరిన సౌతాఫ్రికా ప్లేయర్లకు భారత క్రికెట్‌ అభిమానులు మద్దతు పలికారు. చాలా బాగా ఆడారని, అద్భుతమైన పోరాటం చేశారంటూ బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ ఛాంపియన్స్‌ అంటూ వారికి సపోర్ట్‌ చేశారు. టీమిండియా ఫ్యాన్స్‌ నుంచి వస్తున్న మద్దతు చూసి.. సౌతాఫ్రికా ఆటగాళ్ల కళ్లు కూడా చెమ్మగిల్లాయి. అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ.. ఆటగాళ్లు బస్సు ఎక్కారు. ఈ సీన్స్‌ క్రికెట్‌ అభిమానులు హృదయాలను గెల్చుకుంటున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.