P Venkatesh
భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ లో ఆ కారణంతో టీమిండియా కెప్టెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌతాఫ్రికా బోర్డు చేసిన తప్పిదంతో సూర్య కోపంతో ఊగిపోయారు. అసలు ఏం జరిగిందంటే?
భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ లో ఆ కారణంతో టీమిండియా కెప్టెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌతాఫ్రికా బోర్డు చేసిన తప్పిదంతో సూర్య కోపంతో ఊగిపోయారు. అసలు ఏం జరిగిందంటే?
P Venkatesh
క్రికెట్ లో చిన్న చిన్న తప్పిదాలు ఒక్కోసారి మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ అదే తప్పు క్రికెట్ బోర్డు వల్ల జరిగితే మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. నిన్న భారత్- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ఇదే రీతిలో ఓ తప్పిదం చోటుచేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ చేసిన తప్పిదం వల్ల మిల్లర్ ఔట్ విషయంలో టీమిండియా రివ్యూ కూడా అడగలేకపోయింది. డీఆర్ఎస్ లో సాంకేతిక సమస్య ఉందని అంపైర్లు తెలపడంతో డేవిడ్ మిల్లర్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు.
టీమిండియా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సౌతాఫ్రికా ఆటగాడు మిల్లర్ వికెట్ విషయంలో అంపైర్లు డీఆర్ఎస్ పనిచేయడం లేదని, సాంకేతిక సమస్య ఉందని చెప్పడంతో తీవ్ర దుమారం రేగింది. అయితే మిల్లర్ తొమ్మిదో ఓవర్‌లోనే ఔట్ అవ్వాల్సి ఉంది. జడేజా వేసిన బంతిని మిల్లర్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది బ్యాట్‌కు తాకి వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. టీమిండియా అపీల్ చేయగా.. అంపైర్లు డీఆర్ఎస్ అందుబాటులో లేదని, టెక్నికల్ సమస్య ఉందని తెలిపారు. దాంతో టీమిండియా రివ్యూ తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
దీంతో మిల్లర్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటమేంటని సౌతాఫ్రికా బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక డేవిడ్ మిల్లర్ ఔట్ విషయంలో జరిగిన దానికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా సౌతాఫ్రికా బోర్డుపై అసహనం వ్యక్తం చేశారు. ఇది గల్లీ క్రికెట్ కాదని, అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సౌతాఫ్రికా బోర్డుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జొహానెస్‌బర్గ్ లో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికాతో కలిసి అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 100) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 60) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. కుల్దీప్ యాదవ్(5/17) ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. మరి అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నప్పుడు డీఆర్ఎస్ పనిచేయడం లేదని చేతులెత్తేసిన సౌతాఫ్రికా బోర్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
There was an edge from David Miller’s bat, but DRS is currently unavailable so it was not out. pic.twitter.com/XVQkkyqvin
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2023