SNP
SNP
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆర్చరీలో భారత్‌కు పతకాల పంట పండింది. భారత ఆర్చర్ అదితీ గోపీచంద్ స్వామి సంచలనం సృష్టిస్తూ.. అత్యంత చిన్న వయసులో వరల్డ్ చాంపియన్ టైటిల్ సొంతం చేసుకున్న తొలి ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ పోటీల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కూడా కాంస్యంతో రాణించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో 17 ఏళ్ల అదితి, పురుషుల విభాగంలో 21 ఏళ్ల ఓజాస్ ప్రవీణ్ స్వర్ణాలు గెలిచారు. వీళ్లిద్దరూ కొత్త వరల్డ్ చాంపియన్లుగా అవతరించారు.
ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఎంతో హోరాహోరీగా, ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆరో సీడ్ అదితి 149-147 స్కోరుతో మెక్సికో ఆర్చర్ ఆండ్రియా బెకెర్రానోను ఓడించింది. దీంతో స్వర్ణం ఆమె సొంతమైంది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్‌కే చెందిన రెండో సీడ్ జ్యోతి సురేఖను కూడా అదితి ఓడించింది. సురేఖపై 149-145 స్కోరుతో గెలిచింది. దీంతో కాంస్య పతకం కోసం సురేఖ పోటీ పడింది. ఈ పోటీలో 150కి 150 పాయింట్లు సాధించిన ఆమె.. మూడో స్థానంలో నిలిచి కాంస్యం తన ఖాతాలో వేసుకుంది.
మొత్తం మీద వరల్డ్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో సురేఖకు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు 2019లో కూడా కాంస్యం సాధించింది. ఆ తర్వాత 2021లో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. ఇక పురుషుల ఫైనల్ కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ప్రవీణ్ 149 పాయింట్లు సాధించి, నెదర్లాండ్స్ ఆర్చర్ స్కోసెర్ మైక్‌పై విజయం సాధించాడు. భారత్ ఖాతాలో మొత్తం మూడు స్వర్ణాలు, ఓ కాంస్యం చేరాయి. మరి భారత క్రీడాకారులు మూడు స్వర్ణాలు గెలవడం, అలాగే తెలుగమ్మాయి కాంస్యం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అమెరికాలో కొత్త బిజినెస్ ప్రారంభించిన రోహిత్ శర్మ