Nidhan
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు శుబ్‌మన్ గిల్. అతడి బాటలో నడుస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు శుబ్‌మన్ గిల్. అతడి బాటలో నడుస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.
Nidhan
టీమిండియా ఇంకో సిరీస్‌ను గెలుచుకుంది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్. ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను పట్టేసింది. ఇవాళ జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది యంగ్ ఇండియా. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ మొదలుపెట్టిన మెన్ ఇన్ బ్లూ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్), యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 నాటౌట్) ఆఖరి వరకు నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఎంత ప్రయత్నించినా వీళ్లను ఔట్ చేయలేకపోయారు ఆతిథ్య బౌలర్లు.
గిల్ 6 బౌండరీలు, 2 సిక్సులు కొట్టగా.. జైస్వాల్ 13 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు బాదాడు. ఇద్దరూ కలసి ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడారు. బౌండరీల వర్షం కురిపించి ఇంకో 28 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించిన జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ కైవసం కావడంతో ఆఖరి మ్యాచ్ నామమాత్రం కానుంది. కాబట్టి చివరి టీ20లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని పక్కనబెడితే.. జింబాబ్వే టూర్లో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆకట్టుకుంటున్నాడు. బ్యాటర్‌గానే గాక సారథిగానూ రాణిస్తున్నాడు. ఫీల్డ్ పొజిషన్స్, బౌలింగ్ ఛేంజెస్‌లో రోహిత్ శర్మను తలపిస్తున్నాడు. ముఖ్యంగా ఆ విషయంలో అయితే అతడి వారసుడిగా కనిపిస్తున్నాడు.
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ ఒకే మాట చెబుతూ ఉంటాడు. దాన్నే ఆచరిస్తుంటాడు కూడా. స్వార్థం లేకుండా ఆడాలి. రికార్డులు, మైల్‌స్టోన్స్‌ను పట్టించుకోకుండా జట్టు మేలును దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని సహచరులకు నూరి పోస్తుంటాడు. ఈ ఆలోచన వర్కౌట్ అవడంతో పొట్టి కప్పులో భారత్ విజేతగా నిలిచింది. మెగా టోర్నీలో రోహిత్ తాను ఇదే ఐడియాతో ఆడటమే గాక ఇతరులను కూడా అలాగే ఆడించాడు. ఇప్పుడు ఇదే బాటలో గిల్ ప్రయాణిస్తున్నాడు. ఇవాళ జింబాబ్వేతో మ్యాచ్‌లో సరిగ్గా ప్లాన్ చేస్తే జైస్వాల్ సెంచరీ కొట్టేవాడు.
సెంచరీకి 7 పరుగుల దూరంలో ఆగిపోయాడు జైస్వాల్. అయితే శుబ్‌మన్ మ్యాచ్ సిచ్యువేషన్‌కు తగ్గట్లు ఆడుతూ, అతడ్ని కూడా అదే టెంపోలో ఆడిస్తూ పోయాడు. సెల్ఫిష్ అనే బ్యాడ్ నేమ్, సెంచరీ మిస్ చేయించాడనే అప్రతిష్ట వస్తుందని భయపడకుండా మ్యాచ్‌ను సాధ్యమైనంత వేగంగా ఫినిష్ చేయించాడు. సెంచరీలు, రికార్డుల కంటే జట్టు గెలుపు, అపోజిషన్ టీమ్స్ మీద డామినేషన్ ముఖ్యమని చెప్పకనే చెప్పాడు. ఇలాగే కంటిన్యూ చేస్తే మన టీమ్ మరిన్ని కప్పులు కొట్టడం పక్కా అనే చెప్పాలి. మరి.. రోహిత్ బాటలో గిల్ నడవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.