iDreamPost
android-app
ios-app

ఎంతో మందితో ఆడా.. కానీ ఆ భారత బ్యాటర్​లా ఎవరూ భయపెట్టలేదు: అండర్సన్

  • Published Jul 13, 2024 | 3:42 PM Updated Updated Jul 13, 2024 | 3:42 PM

James Anderson: ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ క్రికెట్​కు గుడ్​ బై చెప్పేశాడు. 21 ఏళ్ల పాటు నిఖార్సయిన పేస్ బౌలింగ్​తో అభిమానుల్ని ఉర్రూతలూగించిన జిమ్మీ ఇక మీదట క్రికెట్​ ఫీల్డ్​లో కనిపించడు.

James Anderson: ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ క్రికెట్​కు గుడ్​ బై చెప్పేశాడు. 21 ఏళ్ల పాటు నిఖార్సయిన పేస్ బౌలింగ్​తో అభిమానుల్ని ఉర్రూతలూగించిన జిమ్మీ ఇక మీదట క్రికెట్​ ఫీల్డ్​లో కనిపించడు.

  • Published Jul 13, 2024 | 3:42 PMUpdated Jul 13, 2024 | 3:42 PM
ఎంతో మందితో ఆడా.. కానీ ఆ భారత బ్యాటర్​లా ఎవరూ భయపెట్టలేదు: అండర్సన్

క్రికెట్​లో ఒక శకం ముగిసింది. ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ జెంటిల్మన్ గేమ్​కు గుడ్​ బై చెప్పేశాడు. 21 ఏళ్ల పాటు నిఖార్సయిన పేస్ బౌలింగ్​తో అభిమానుల్ని ఉర్రూతలూగించిన జిమ్మీ ఇక మీదట క్రికెట్​ ఫీల్డ్​లో కనిపించడు. ఈతరం చూసిన బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్​లో అండర్సన్​ టాప్​లో ఉంటాడు. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణించిన అతడు.. టెస్ట్ స్పెషలిస్ట్​గా పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ఘ కెరీర్​లో ఏకంగా 188 టెస్టుల్లో 704 వికెట్లు తీసి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్​గా నిలిచాడు. ఒక పేస్ బౌలర్ అన్ని వికెట్లు తీస్తాడని ఎవరూ ఊహించలేదు. గాయాలతో సావాసం చేసే సీమర్స్ రెండు దశాబ్దాలకు పైగా కంటిన్యూ అవడం అంటే అదో మ్యాజిక్ అనే చెప్పాలి. ఓవరాల్​ కెరీర్​లో 40 వేల బంతులు వేయడం మరో హైలైట్.

147 ఏళ్ల క్రికెట్ హిస్టరీలో ఒక బౌలర్ 40 వేల బంతుల మార్క్​ను అందుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. వెస్టిండీస్​తో జరిగిన లార్డ్స్ టెస్ట్​తో కెరీర్​కు గుడ్​బై చెప్పిన జిమ్మీ.. ఈ మ్యాచ్​లో 4 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్​లో 3 వికెట్లు తీసి విండీస్​ పతనాన్ని శాసించాడు. పోతూ పోతూ ఓ సూపర్ డెలివరీ వేశాడు. అద్భుతమైన ఇన్​స్వింగర్​ వేసి బ్యాటర్​ను క్లీన్​బౌల్డ్ చేశాడు. అండర్సన్​కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఇంగ్లండ్ ఫ్యాన్స్ భారీగా లార్డ్స్​కు తరలివచ్చారు. ఆఖరుగా డ్రెస్సింగ్ రూమ్​లో షాంపేన్ తాగి వాళ్లకు చీర్స్ చెప్పాడు అండర్సన్. ఇన్నేళ్ల కెరీర్​లో ఎంతో మందితో కలసి ఆడిన ఈ ఇంగ్లీష్ సీమర్.. టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ అంటే మాత్రం తనకు భయమని అంటున్నాడు. అతడ్ని ఎక్కువ సార్లు ఔట్ చేయలేకపోయాననే బాధ తనను వెంటాడుతోందని చెప్పాడు.

‘ఏ ప్లేయర్ కెరీర్​లో అయినా ఎత్తుపళ్లాలు ఉంటాయి. కొన్ని సిరీస్​ల్లో బాగా ఆడాననే ఫీలింగ్ ఉంటుంది. ఇంకొన్ని సిరీస్​ల్లో బ్యాటర్లు నా బౌలింగ్​లో ఈజీగా రన్స్ చేశారని అనిపిస్తుంది. విరాట్ కోహ్లీని కెరీర్ స్టార్టింగ్​ టైమ్​లో చాలామార్లు అలవోకగా ఔట్ చేశా. ప్రతి బాల్​కు అతడ్ని ఔట్ చేస్తానని అనిపించేది. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితి మారిపోయింది. విరాట్​ను ఔట్ చేయడం అసాధ్యంగా మారింది. అది నన్ను న్యూనతకు గురిచేసింది. అతడ్ని ఎక్కువ సార్లు ఔట్ చేయలేకపోయాననే బాధ ఉంది’ అని అండర్సన్ చెప్పుకొచ్చాడు. తాను బౌలింగ్ చేసిన వారిలో బెస్ట్ బ్యాటర్​గా మాస్టర్​బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు చెప్పాడు జిమ్మీ. సచిన్ బ్యాటింగ్​కు వచ్చిన ప్రతిసారి అతడికి చెత్త బాల్ వేయొద్దని ఆలోచనతోనే ఆడేవాడ్నని గుర్తుచేసుకున్నాడు. ఎంత బాగా వేసినా సచిన్ పరుగులు రాబట్టేవాడంటూ మెచ్చుకున్నాడు. మరి.. కోహ్లీ-సచిన్​ మీద అండర్సన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.