Nidhan
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత్ రెడీ అవుతోంది. ఇరు జట్ల మధ్య టీ20లతో పాటు వన్డే మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. ఈ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత్ రెడీ అవుతోంది. ఇరు జట్ల మధ్య టీ20లతో పాటు వన్డే మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. ఈ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత భారత జట్టు మరింత బిజీ అయిపోయింది. మెగాటోర్నీ ముగిసిన వెంటనే జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ ఆడింది యంగ్ ఇండియా. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కుర్రాళ్లతో కూడిన భారత జట్టు ఆ టూర్‌కు వెళ్లింది. అయితే తొలి మ్యాచ్‌లో తడబడ్డా ఆ తర్వాత వరుస విజయాలతో సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. జింబాబ్వే పర్యటన ముగించుకొని కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ప్లేయర్లు ఇప్పుడు మరో సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు రెడీ అవుతోంది. ఈ సిరీస్ జులై 27వ తేదీన మొదలవనుంది.
జులై 27న జరిగే తొలి టీ20తో భారత్-లంక సిరీస్‌కు తెరలేవనుంది. ఆ తర్వాత వరుసగా రెండ్రోజుల పాటు మరో రెండు టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన వెంటనే వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆగస్టు 1న తొలి వన్డే జరగనుంది. అనంతరం ఆగస్టు 4న రెండో వన్డే, 7న మూడో వన్డే జరుగుతాయి. వన్డే టీమ్‌కు రోహిత్ శర్మ, టీ20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్‌గా వ్యవహరిస్తారు. ఈ సిరీస్‌పై ఆడియెన్స్ ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో కొత్త సారథి సూర్య జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్-లంక సిరీస్‌లోని అన్ని మ్యాచుల్ని సోనీ లివ్ సంస్థ టెలికాస్ట్ చేయనుంది.
టీమిండియా-శ్రీలంక సిరీస్ మ్యాచులను టీవీల్లో చూడాలనుకుంటే సోనీ టెన్ 3 ఛానల్లో చూడొచ్చు. ఈ ఛానెల్లో హిందీ కామెంట్రీ ఉంటుంది. అదే ఇంగ్లీష్ కామెంట్రీ కావాలనుకుంటే సోనీ టెన్ 5 ఛానల్లో చూడొచ్చు. ఒకవేళ డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనుంటే సోనీ లివ్ యాప్‌లోకి వెళ్లి మ్యాచుల్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. భారత్-లంక సిరీస్‌లోని టీ20 మ్యాచులు సాయంత్రం 6.30 నుంచి మొదలవుతాయి. వన్డే మ్యాచులు మధ్యాహ్నం 2.30కు స్టార్ట్ అవుతాయి. మరి.. ఈ క్రికెట్ సిరీస్ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
India Vs Sri Lanka poster by Sony Sports. pic.twitter.com/oXGcj1RDZ6
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2024