SNP
IND vs SL, Hardik Pandya, KL Rahul: శ్రీలంకతో ఈ నెల 26 నుంచి భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మరి ఆ రెండు సిరీస్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
IND vs SL, Hardik Pandya, KL Rahul: శ్రీలంకతో ఈ నెల 26 నుంచి భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మరి ఆ రెండు సిరీస్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా ఒక టఫ్ కాంపిటీషన్ ఎదురుకానుంది. వరల్డ్ కప్ టీమ్‌లోని చాలా మందికి రెస్ట్ ఇవ్వడంతో.. యంగ్ టీమిండియా ప్రస్తుతం జింబాబ్వేతో సిరీస్ ఆడుతోంది. ఐదు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేకు వెళ్లిన యువ భారత జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లను ముగించుకుంది. మరో రెండు మ్యాచ్‌లు ఆడేసి స్వదేశానికి తిరిగి రానుంది. ఆ తర్వాత.. శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. ఈ నెల 26 నుంచి ఆగస్టు 7 వరకు లంకలో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం నేడో రేపో భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది భారత జట్టు. మరి ఆ సిరీస్‌ల మ్యాచ్‌లు ఎప్పుడు ఉన్నాయి. ఎక్కడ జరగనున్నాయి. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జులై 26న పల్లెకెలెలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అలాగే నెక్ట్స్ డే అంటే 27వ తేదీన రెండో టీ20, 29వ తేదీన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మూడు టీ20లు కూడా ఒకే వేదికలో జరగనున్నాయి. పల్లెకెలె స్టేడియంలోనే మూడు టీ20లు మ్యాచ్‌లు ఆడనుంది భారత జట్టు.
టీ20 సిరీస్ తర్వాత.. వెంటనే మూడు వన్డేల సిరీస్ జరగనుంది ఆగస్టు 1న కొలంబో వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఆగస్టు 4వ తేదీన రెండో వన్డే సేమ్ టైమ్, సేమ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఇక చివరి వన్డే ఆగస్టు 7న అదే కొలంబో గ్రౌండ్‌లో సేమ్ టైమ్‌కి ప్రారంభం కానుంది. కాగా, టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ క్రికెటర్లకు టీమ్‌లో అవకాశం దక్కనుంది. ఇక వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉంటాడని తెలుస్తోంది. రోహిత్‌కు రెస్ట్ ఇస్తుండటంతో కేఎల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 NEWS 🚨
Fixtures for the upcoming India tour of Sri Lanka announced! 📢#TeamIndia | #SLvIND pic.twitter.com/oBCZn0PlmK
— BCCI (@BCCI) July 11, 2024