iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: సూర్యకుమార్ అరుదైన ఘనత.. కోహ్లీ తర్వాత అతడికే సాధ్యమైంది!

  • Published Jul 28, 2024 | 11:12 AM Updated Updated Jul 28, 2024 | 11:12 AM

India vs Sri Lanka: టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా కింగ్ కోహ్లీ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.

India vs Sri Lanka: టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా కింగ్ కోహ్లీ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.

  • Published Jul 28, 2024 | 11:12 AMUpdated Jul 28, 2024 | 11:12 AM
Suryakumar Yadav: సూర్యకుమార్ అరుదైన ఘనత.. కోహ్లీ తర్వాత అతడికే సాధ్యమైంది!

టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫస్ట్ అసైన్​మెంట్​లో పాస్ అయ్యాడు. శ్రీలంక సిరీస్​తో ఫుల్​టైమ్ కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించిన మిస్టర్ 360.. ఫస్ట్ మ్యాచ్​లోనే జట్టుకు భారీ విజయం అందించాడు. పల్లెకెలె స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్​లో మెన్ ఇన్ బ్లూ 43 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ (26 బంతుల్లో 58) కెప్టెన్సీ నాక్​తో చెలరేగాడు. రిషబ్ పంత్ (33 బంతుల్లో 49), యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40) కూడా సూపర్బ్​గా ఆడారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. పతుమ్ నిస్సంక (48 బంతుల్లో 79), కుశాల్ మెండిస్ (27 బంతుల్లో 45) పోరాడినా ఫలితం లేకపోయింది.

భారత బౌలర్లలో అర్ష్​దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. రియాన్ పరాగ్ (3/5) జట్టుకు సర్​ప్రైజ్ ప్యాకేజ్​గా మారాడు. మూడు వికెట్లతో అతడు లంక నడ్డి విరిచాడు. కెప్టెన్సీ నాక్​తో టీమ్​కు భారీ స్కోరు అందించిన సూర్యకుమార్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్​తో మిస్టర్ 360 అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్ హిస్టరీలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్న ఆటగాడిగా కింగ్ కోహ్లీ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు. 125 మ్యాచుల్లో విరాట్ 16 సార్లు ఈ అవార్డుకు ఎంపికవగా..​ సూర్య 69 మ్యాచుల్లోనే పదహారు సార్లు ఆ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం.

Surya

ఫస్ట్ టీ20లో సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే, రెగ్యులర్ కెప్టెన్​గా ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అతడిపై ప్రెజర్ నెలకొంది. టీ20 ఛాంపియన్స్​గా ఉన్న భారత్.. ఆ విన్నింగ్ స్ట్రీక్​ను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సూర్య ఎలా ఆడతాడోననే సందేహాలు నెలకొన్నాయి. కానీ మ్యాచ్ ఆరంభం అయ్యాక ఇవన్నీ పటాపంచలు అయ్యాయి. ఫస్ట్ డౌన్​లో వచ్చిన సూర్య స్టార్టింగ్ నుంచే హిట్టింగ్​కు దిగాడు. 26 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. 8 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సర్లతో లంక బౌలర్లను చీల్చిచెండాడాడు. 223 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా షాట్లు బాదాడు. కెప్టెన్సీ వచ్చినా తన అప్రోచ్​లో ఎలాంటి మార్పు లేదని.. దూకుడే మంత్రంగా దూసుకెళ్తానని క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చాడు. మరి.. కోహ్లీ సరసన సూర్య చోటు దక్కించుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)