Nidhan
India vs Sri Lanka: టీమిండియా మరో సిరీస్‌ను పట్టేసింది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.
India vs Sri Lanka: టీమిండియా మరో సిరీస్‌ను పట్టేసింది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.
Nidhan
టీమిండియా మరో సిరీస్‌ను పట్టేసింది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు ఓవర్లన్నీ ఆడి 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ పతుమ్ నిస్సంక (24 బంతుల్లో 32), కుశాల్ పెరీర (34 బంతుల్లో 53) రాణించారు. మిగతా వాళ్లు విఫలమవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లతో లంక నడ్డి విరిచాడు.
భారత్ ఛేజింగ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. వాన వల్ల మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టార్గెట్‌ను 78గా సెట్ చేశారు. దీన్ని మరో 9 బంతులు ఉండగానే టీమిండియా అందుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్) అదరగొట్టడంతో లక్ష్యాన్ని ఊదిపారేసింది మెన్ ఇన్ బ్లూ. మూడు వికెట్లతో లంక భారీ స్కోరు చేయకుండా అడ్డుపడిన స్పిన్నర్ బిష్ణోయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిన్నటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ టైమ్‌లో జరిగిన ఓ ఘటన వైరల్‌గా మారింది. యంగ్ బ్యాటర్ జైస్వాల్‌కు సారథి సూర్య క్లాస్ పీకాడు.
టీమిండియా ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసేందుకు వచ్చాడు లంక సీనియర్ స్పిన్నర్ వనిందు హసరంగ. అయితే క్రీజులో ఉన్న జైస్వాల్ అతడిపై అటాకింగ్‌కు దిగాడు. భారీ షాట్లు బాదుతూ అతడ్ని భయపెట్టాడు. మొదటి రెండు బంతుల్లోనే 10 పరుగులు పిండుకున్నాడు. అయినా మూడో బాల్‌కు హిట్టింగ్‌కు వెళ్లాడు. దీంతో సూర్య అతడికి క్లాస్ పీకాడు. ఆల్రెడీ ఈ ఓవర్లో కావాల్సిన రన్స్ వచ్చేశాయి.. ఇంకా అటాకింగ్ ఎందుకు అంటూ సీరియస్ అయ్యాడు. అయితే మాట విన్నట్లే కనిపించిన జైస్వాల్.. తర్వాతి బాల్‌కు మళ్లీ హిట్టింగ్‌కే దిగాడు. దీంతో ఇక చాలంటూ సూర్య అతడికి మళ్లీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే మిస్టర్ 360 ఔట్ అయ్యాక మళ్లీ హసరంగను టార్గెట్ చేశాడు జైస్వాల్. అతడి సెకండ్ ఓవర్లో దూకుడుగా ఆడి పరుగులు రాబట్టినా అదే ఓవర్లో ఔట్ అయి వెళ్లిపోయాడు. మరి.. జైస్వాల్ కెప్టెన్ మాట వినకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Surya to Jaiswal – enough runs aagye hain isme (enough runs scored in this over).
– Yashasvi Jaiswal still goes for an attacking shot. 😄 pic.twitter.com/77oj5C1STM
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 28, 2024