Nidhan
India vs Sri Lanka: క్రికెట్లో పైకి రావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఇసుమంత అదృష్టం కూడా తోడవ్వాలని ఎక్స్పర్ట్స్ అంటుంటారు. ఈ ప్లేయర్ గురించి తెలిస్తే ఇది నిజమేనని ఒప్పుకోకమానరు.
India vs Sri Lanka: క్రికెట్లో పైకి రావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఇసుమంత అదృష్టం కూడా తోడవ్వాలని ఎక్స్పర్ట్స్ అంటుంటారు. ఈ ప్లేయర్ గురించి తెలిస్తే ఇది నిజమేనని ఒప్పుకోకమానరు.
Nidhan
క్రికెట్లో పైకి రావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఇసుమంత అదృష్టం కూడా ఉండాలని ఎక్స్పర్ట్స్ అంటుంటారు. ఈ ప్లేయర్ గురించి తెలిస్తే ఇది నిజమేనని ఒప్పుకోకమానరు. భారత్‌లో ప్రస్తుతం ఉన్న బెస్ట్ బ్యాటర్స్‌లో అతనొకడు. బ్యాటింగ్ ఒక్కటే కాదు.. వికెట్ కీపింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ టీమ్‌కు గత కొన్ని సీజన్లుగా కెప్టెన్‌గా ఉంటూ సారథ్యంలోనూ ఆరితేరాడు. ఎప్పుడూ కూల్‌గా ఉంటూ, ఇతర ఆటగాళ్ల మీద కూడా ఒత్తిడి పడకుండా చూసుకుంటాడతను. న్యాచురల్ బ్యాటింగ్‌ను పక్కనబెట్టి టీమ్ అవసరాలకు తగ్గట్లు ఆడుతుంటాడు. ఐపీఎల్ సహా ఇంటర్నేషనల్ లెవల్లో ఎప్పుడు ఛాన్స్ వచ్చినా పరుగుల వరద పారిస్తుంటాడు. ఎంతో టాలెంట్ ఉన్న ఆ ప్లేయర్‌కు మళ్లీ అన్యాయం జరిగింది. అతడు టీమ్‌లో ఉండాల్సిదేనన్న కోచే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేదు.
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోమారు మొండిచెయ్యి ఎదురైంది. శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టీ20లో అతడికి చోటు దక్కలేదు. ఇన్నాళ్లూ సంజూ లాంటి ప్లేయర్ మకరొరు లేరు, అతడు తోపు బ్యాటర్, అతడ్ని ఎందుకు ఆడించట్లేదంటూ గగ్గోలు పెట్టిన గంభీర్.. తీరా కోచ్ అయ్యాక సంజూను పక్కనబెట్టడం గమనార్హం. లంకతో తొలి టీ20లో పంత్ ప్లేస్‌లో కాకపోయినా ఎక్కడో ఒక చోట శాంసన్‌ను ఆడించాల్సింది. కానీ అతడికి చోటు దక్కలేదు. ఎన్నో ఏళ్లుగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సంజూను కాదని.. ఈ మధ్యనే డెబ్యూ ఇచ్చిన రియాన్ పరాగ్‌ను మాత్రం టీమ్‌లోకి తీసుకున్నారు. దీంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఇది దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.
సంజూను పక్కనబెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. అప్పుడెప్పుడో 9 ఏళ్ల కింద భారత టీ20 జట్టులో అతడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 28 మ్యాచుల్లో మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ తొమ్మిదేళ్లలో ఏడుగురు కెప్టెన్లు టీ20 టీమ్‌కు సారథ్యం వహిస్తే.. ఒక్కరు కూడా సంజూకు అండగా నిలవలేదు. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాతో పాటు తాజాగా సూర్యకుమార్ సారథ్యంలోనూ సంజూను టీమ్ నుంచి డ్రాప్ చేయడం గమనార్హం. దీంతో శాంసన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అతడి టాలెంట్ అంతా వృథా అవుతోందని.. సంజూ ఓ అభినవ కర్ణుడిలా మారాడంటున్నారు నెటిజన్స్. ఇంతకంటే దురదృష్టవంతుడు క్రికెట్లో ఉండడేమోనని వాపోతున్నారు. టీమ్ మేనేజ్మెంట్ మారినా అతడి రాత మారలేదని.. ఇంకా ఏం చేస్తే అతడ్ని జట్టులోకి తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. సంజూను టీమ్‌లోకి తీసుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.