iDreamPost
android-app
ios-app

IND vs SL: లంకతో మ్యాచ్​లో నల్ల రిబ్బన్లతో బరిలోకి భారత్.. ఎందుకిలా చేశారంటే?

  • Published Aug 02, 2024 | 3:18 PM Updated Updated Aug 02, 2024 | 3:18 PM

భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే మొదలైంది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్​లో టీమిండియా క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే మొదలైంది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్​లో టీమిండియా క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

  • Published Aug 02, 2024 | 3:18 PMUpdated Aug 02, 2024 | 3:18 PM
IND vs SL: లంకతో మ్యాచ్​లో నల్ల రిబ్బన్లతో బరిలోకి భారత్.. ఎందుకిలా చేశారంటే?

భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే మొదలైంది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న ప్రేమదాస స్టేడియంలో ఛేజింగ్ కష్టమనే ఉద్దేశంతో మొదట బ్యాటింగ్​కు దిగింది లంక. ఈ మ్యాచ్​లో భారత ఆటగాళ్లు తమ చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్​లోకి దిగారు. దీంతో అసలు ఎందుకిలా చేశారనేది చాలా మందికి అర్థం కాక దీని వెనుక కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీమిండియా లెజెండ్ అన్షుమన్ గైక్వాడ్​ ఇటీవల క్యాన్సర్​కు చికిత్స పొందుతూ మృతి చెందారు.

భారత క్రికెట్​కు ఏళ్ల పాటు సేవలు అందించిన అన్షుమన్ గైక్వాడ్ మృతికి సంతాపంగా లంకతో వన్డేలో భారత ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ఆడారు. ఇక, ఈ మ్యాచ్​ కోసం భారత్ ఇంట్రెస్టింగ్ ప్లేయింగ్ ఎలెవన్​తో వెళ్లింది.​ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్​కు జట్టులో చోటు దక్కలేదు. టాపార్డర్​లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుబ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు. వికెట్ కీపర్​గా వచ్చిన సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మిడిలార్డర్​లో దిగుతారు. స్పెషలిస్ట్ స్పిన్నర్​గా కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడు. పేస్ బాధ్యతల్ని అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ పంచుకుంటున్నారు. మరి.. సిరీస్ ఓపెనర్​లో భారత్ అదరగొడుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.