Nidhan
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ అదరగొడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకు కట్టడి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన స్ట్రాటజీలతో ఆ టీమ్ పని పట్టాడు.
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ అదరగొడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకు కట్టడి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన స్ట్రాటజీలతో ఆ టీమ్ పని పట్టాడు.
Nidhan
సాధారణంగా క్రికెట్లో ఏ బ్యాటర్‌ను ఎలా ఔట్ చేయాలనేది ముందే ప్లానింగ్ చేసుకొని వస్తుంటాయి బౌలింగ్ టీమ్స్. వాళ్ల వీక్నెస్, స్ట్రెంగ్త్ ఏంటనేది ముందే తెలుసుకొని ఎక్కడెక్కడ ఔలింగ్ చేయాలి? ఫీల్డ్ పొజిషన్స్ ఎలా పెట్టాలనేది? డిసైడ్ అయి వస్తుంటాయి. అయితే కొందరు కెప్టెన్లు మాత్రం స్పాట్లోనే ఇంప్రువైజ్ చేస్తుంటారు. దీనికి టీమిండియా సారథి రోహిత్ శర్మ బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. మ్యాచ్ కండీషన్స్, బ్యాటర్ ఆడుతున్న తీరును బట్టి సరికొత్త వ్యూహాలతో చిత్తు చేస్తుంటాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలోనూ ఇలాగే స్పాట్లోనే స్కెచ్ వేసి ప్రత్యర్థి కెప్టెన్ బిత్తరపోయేలా చేశాడు హిట్‌మ్యాన్.
18.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఉంది శ్రీలంక. అప్పుడు క్రీజులోకి అడుగుపెట్టాడు లంక కెప్టెన్ చరిత్ అసలంక. అయితే అప్పటికే ఆ జట్టు బ్యాటర్లు ఔట్ అయిన తీరును గమనించిన రోహిత్.. అసలంక కోసం స్పెషల్ ప్లాన్ వేశాడు. లంక బ్యాటర్లు ఆఫ్ సైడ్ షాట్లు సరిగ్గా కొట్టలేకపోవడం, స్వీప్ షాట్లు ఆడటం లేదా అడ్డదిడ్డంగా బంతిని ఊపడం అబ్జర్వ్ చేసి అసలంక కోసం లెగ్ సైడ్ ఎక్కువ మంది ఫీల్డర్లను మోహరించాడు. అదే టైమ్‌లో ఆఫ్ సైడ్ కూడా క్యాచింగ్ పొజిషన్స్‌లో కొందర్ని ఉంచి, తాను వెళ్లి స్లిప్‌లో నిల్చున్నాడు.
లెగ్ సైడే కొడతాడు, గుర్తుంచుకో అంటూ కుల్దీప్కు చెప్పాడు రోహిత్. ఆఫ్ సైడ్ బంతులు వేసి బ్యాటర్‌ను రెచ్చగొట్టమంటూ సూచించాడు. దీంతో అతడు అటు వైపే బంతులు వేయగా.. షాట్లు ఆడినా కనెక్ట్ అవకపోవడంతో అసలంక ఫ్రస్టేషన్‌కు లోనయ్యాడు. కుల్దీప్ వేసిన నెక్స్ట్ ఓవర్లో థర్డ్ మ్యాన్ దిశగా గట్టిగా షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ మిస్ ఫైర్ అవడంతో బాల్ కాస్తా వెళ్లి స్లిప్‌లో ఉన్న రోహిత్ చేతుల్లో పడింది. హిట్‌మ్యాన్ స్కెచ్‌ను అర్థం చేసుకునే లోపు ఔట్ అయ్యాడు లంక సారథి. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. మరి.. సిరీస్ ఓపెనర్‌లో రోహిత్ కెప్టెన్సీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Rohit Sharma on the stump mic : ” Udhar Hi Marenge aada 😂👋.'”
Most unfiltered guy, for real 😜. pic.twitter.com/Ezg6581W9V
— Jod Insane (@jod_insane) August 2, 2024