iDreamPost
android-app
ios-app

Rohit Sharma: నువ్వు కూడా బౌలింగ్ చేస్తావా? రోహిత్ దిమ్మతిరిగే ఆన్సర్​!

  • Published Aug 02, 2024 | 3:57 PM Updated Updated Aug 02, 2024 | 3:57 PM

India vs Sri Lanka: భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​ టాస్​ టైమ్​లో రోహిత్ శర్మకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.

India vs Sri Lanka: భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​ టాస్​ టైమ్​లో రోహిత్ శర్మకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.

  • Published Aug 02, 2024 | 3:57 PMUpdated Aug 02, 2024 | 3:57 PM
Rohit Sharma: నువ్వు కూడా బౌలింగ్ చేస్తావా? రోహిత్ దిమ్మతిరిగే ఆన్సర్​!

భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. ఈ మ్యాచ్​లో స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్​కు చోటు దక్కలేదు. అతడికి బదులు సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్​ను టీమ్​లోకి తీసుకుంది టీమిండియా. అతడే కీపింగ్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పంత్ తప్ప.. ప్లేయింగ్ ఎలెవన్​లో మిగతా అన్ని ప్లేసెస్​లో అనుకున్న ప్లేయర్లనే తీసుకున్నారు. ఇక, ఈ మ్యాచ్​ టాస్​ టైమ్​లో రోహిత్ శర్మకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ‘నువ్వు కూడా బౌలింగ్ చేస్తావా?’ అని కామెంటేటర్ హిట్​మ్యాన్​ను అడిగారు. దీనికి అతడు దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చాడు.

ఇక మీదట తన ఫోకస్ కేవలం బ్యాటింగ్ మీదే ఉంటుందన్నాడు రోహిత్. ఎప్పటిలాగే బ్యాటింగ్, సారథ్యం.. ఈ రెండింటి పైనే దృష్టి సారిస్తానన్నాడు. జట్టులో చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయని.. కాబట్టి తాను చేయి తిప్పాల్సిన అవసరం లేదన్నాడు హిట్​మ్యాన్. కాగా, కొత్త కోచ్ గంభీర్ రాకతో బ్యాటర్లు బౌలర్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆరో బౌలర్​ ప్లేస్​ను భర్తీ చేసేందుకు రియాన్ పరాగ్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ లాంటి బ్యాటర్లతో బౌలింగ్ చేయించి గౌతీ ఫలితం రాబట్టాడు. వీళ్లందరూ లంకతో టీ20 సిరీస్​లో బ్యాట్​తో పాటు బాల్​తోనూ సక్సెస్ అయ్యారు. వన్డే సిరీస్​కు ముందు శ్రేయస్ అయ్యర్​తో నెట్స్​లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు గంభీర్. ఈ నేపథ్యంలోనే ‘నువ్వు కూడా బౌలింగ్ చేస్తావా?’ అంటూ రోహిత్​కు ప్రశ్న ఎదురైంది.