Rohit Sharma: వీడియో: లంక బ్యాటర్లను ఆటపట్టించిన రోహిత్.. ఆ డైలాగ్​కు అర్థం ఏంటి?

India vs Sri Lanka: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. గ్రౌండ్ బయటే కాదు లోపల కూడా ఇదే విధంగా ఉంటూ తోటి ప్లేయర్లకు ఒత్తిడి దరిచేరకుండా చూసుకుంటాడు.

India vs Sri Lanka: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. గ్రౌండ్ బయటే కాదు లోపల కూడా ఇదే విధంగా ఉంటూ తోటి ప్లేయర్లకు ఒత్తిడి దరిచేరకుండా చూసుకుంటాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. గ్రౌండ్ బయటే కాదు లోపల కూడా ఇదే విధంగా ఉంటూ తోటి ప్లేయర్లకు ఒత్తిడి దరిచేరకుండా చూసుకుంటాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ ఇదే రిపీట్ చేశాడు. సిరీస్​ను సమం చేయాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ ఇది. అటు లంక ఓపెనర్లు నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96)తో పాటు కుశాల్ మెండిస్ (59) అద్భుతంగా ఆడుతూ భారత్​ను భయపెడుతున్నారు. దీంతో ఒత్తిడిలో ఉన్న బౌలర్లను కూల్ చేశాడు రోహిత్. లంక బ్యాటర్లను ఆటపట్టిస్తూ మన బౌలర్లలో జోష్ నింపాడు.

లంక బ్యాటర్లను వాళ్ల భాషలోనే మాట్లాడుతూ ఆడుకున్నాడు రోహిత్. ‘అన్నహారి.. మేకహారి’ అంటూ వాళ్లను ఆటపట్టించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్​లో వికెట్ల వెనుక స్లిప్స్​లో ఫీల్డింగ్ చేస్తూ సింహళ భాషలో డైలాగ్స్ చెబుతూ ప్రత్యర్థి బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నించాడు హిట్​మ్యాన్. అతడి సెటైర్స్​తో భారత ప్లేయర్లు నవ్వుకున్నారు. లంక ఆటగాళ్లు కూడా నవ్వుల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. రోహిత్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్​టైన్​మెంట్ పక్కా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. హిట్​మ్యాన్ ఎలాంటి సిచ్యువేషన్​ను అయినా కూల్​ చేసేస్తాడని అంటున్నారు. ఇక, రోహిత్ చెప్పిన ఆ డైలాగ్​కు ‘ఇది కరెక్ట్, ఇలాగే.. ఇలాగే’ అని అర్థమట.

Show comments