iDreamPost
android-app
ios-app

Virat Kohli: వీడియో: ఫుల్ అగ్రెషన్ మోడ్​లో కోహ్లీ.. లంకపై ఎందుకింత కోపం?

  • Published Aug 07, 2024 | 7:31 PM Updated Updated Aug 07, 2024 | 7:32 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రెషన్​ మోడ్​లోకి వచ్చేశాడు. లంకతో జరుగుతున్న ఆఖరి వన్డేలో విరాట్ తన ఓల్డ్ అవతార్​లోకి మారిపోయాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రెషన్​ మోడ్​లోకి వచ్చేశాడు. లంకతో జరుగుతున్న ఆఖరి వన్డేలో విరాట్ తన ఓల్డ్ అవతార్​లోకి మారిపోయాడు.

  • Published Aug 07, 2024 | 7:31 PMUpdated Aug 07, 2024 | 7:32 PM
Virat Kohli: వీడియో: ఫుల్ అగ్రెషన్ మోడ్​లో కోహ్లీ.. లంకపై ఎందుకింత కోపం?

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రెషన్​ మోడ్​లోకి వచ్చేశాడు. లంకతో జరుగుతున్న ఆఖరి వన్డేలో విరాట్ తన ఓల్డ్ అవతార్​లోకి మారిపోయాడు. లంక ఇన్నింగ్స్ టైమ్​లో కింగ్ ఫుల్ అగ్రెసివ్​గా కనిపించాడు. ఆ కోపం, అగ్రెషన్ మొత్తం వింటేజ్ కోహ్లీనే చూస్తున్నట్లే అనిపించింది. అరంగేట్ర ఆటగాడు రియాన్ పరాగ్ వికెట్లు తీస్తుంటే తానే తీసినంత సంతోషంతో కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు. వికెట్లు పడిన టైమ్​లో అరుస్తూ, గాల్లో పంచులు విసురుతూ అగ్రెసివ్​గా కనిపించాడు కోహ్లీ. దీంతో అసలు కింగ్ ఎందుకింత కోపంగా ఉన్నాడో చాలా మందికి అర్థం కాలేదు.

టీ20 వరల్డ్ కప్-2024 సమయంలో కూడా కోహ్లీ ఓవర్ అగ్రెసివ్​గా కనిపించలేదు. కూల్​గా తన పని తానేదో చేసుకుంటూ పోయాడు. సెమీస్, ఫైనల్స్ లాంటి కీలక మ్యాచుల్లోనూ ప్రశాంతంగా ఆడుతూ పోయాడు. అలాంటోడు ఇవాళ లంక లాంటి టీమ్​పై ఇంత కోపంతో రగిలిపోవడానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. తరచి చూస్తే దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. కింగ్ ఇప్పుడు ఫామ్​లో లేడు. లంకతో జరుగుతున్న వన్డే సిరీస్​లో వరుసగా రెండు మ్యాచుల్లో స్పిన్నర్ల బౌలింగ్​లో ఔట్ అయ్యాడు. తన రేంజ్​కు ఇది కరెక్ట్ కాదు.

kohli angry

లంక టీమ్​తో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా చెలరేగిపోయే కోహ్లీ.. ఈ సిరీస్​లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో కాస్త అసహనానికి లోనైనట్లు కనిపిస్తున్నాడు. మరోవైపు 1-0తో లీడింగ్​లో ఉన్న లంక సిరీస్​ను ఎగరేసుకుపోయేలా ఉంది. అందుకే డిసైడర్ మ్యాచ్​లో తనలోని బెస్ట్ పెర్ఫార్మెన్స్​ను బయటకు తీయడానికి కోహ్లీ అగ్రెసివ్ అప్రోచ్​ను ఎంచుకున్నట్లు కనిపిస్తోందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి.. కోహ్లీ మళ్లీ అగ్రెసివ్​ మోడ్​లో కనిపించడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.