SNP
Mohamed Shiraz, IND vs SL: భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డేతో ఓ యువ క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అతని పేరు మహ్మద్ సిరాజ్. ఈ యువ బౌలర్ శ్రీలంక తరఫున బరిలోకి దిగనున్నాడు.
Mohamed Shiraz, IND vs SL: భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డేతో ఓ యువ క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అతని పేరు మహ్మద్ సిరాజ్. ఈ యువ బౌలర్ శ్రీలంక తరఫున బరిలోకి దిగనున్నాడు.
SNP
భారత్-శ్రీలంక మధ్య కొలంబో వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం అయింది. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు కూడా అదే టార్గెట్‌తో బరిలోకి దిగింది. లంకతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్‌తో రోహిత్ ఈ సిరీస్ కోసం సిద్ధం అయ్యాడు. అయితే.. టీమిండియాను అడ్డుకునేందుకు శ్రీలంక మహ్మద్ షిరాజ్‌ను తెచ్చకుంది.. పేరు విని మన హైదరాబాదీ కుర్రాడు, టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అనుకునేరు.. ఈ షిరాజ్ వేరు. ఇతను శ్రీలంక కుర్రాడు.
తాజాగా ఇండియాతో తొలి వన్డేతో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. శ్రీలంక స్టార్ బౌలర్లు మతీషా పతిరానా, దిల్షన్ మధుశంక గాయాలతో ఈ వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. వారి స్థానంలో మహ్మద్ షిరాజ్, ఈషాన్ మలింగ యువ బౌలర్లను జట్టులోకి తీసుకుంది శ్రీలంక. వీరిలో మహ్మద్ షిరాజ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది. ఇక తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. శ్రీలంకకు నైట్‌మేర్ లాంటి సిరాజ్.. ఆరంభంలోనే లంకను దెబ్బకొట్టాడు.
శ్రీలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండోను ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతికి అవుట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ వికెట్‌తో టీమిండియాకు మంచి స్టార్ట్ ఇచ్చాడు సిరాజ్. శ్రీలంకపై వన్డేల్లో సిరాజ్ మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 2023లో జరిగిన ఆసియా కప్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. శ్రీలంకపై చెలరేగి బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా ఆసియా కప్ ఫైనల్‌లో అయితే.. ఏకంగా 6 వికెట్లు కుప్పకూల్చాడు. లంకను 50కే ఆలౌట్ చేశాడు. అప్పటి నుంచి శ్రీలంకతో మ్యాచ్ అంటే చాలు అందరికీ సిరాజ్ గుర్తుకు వస్తాడు. ఇప్పుడు ఈ వన్డేలో కూడా తొలి వికెట్ సిరాజే అందించాడు. ఇలాంటి బౌలర్ తమకు కూడా కావాలని నేమ్‌తో ఉన్న బౌలర్‌ను తెచ్చకుంది శ్రీలంక. మరి కొత్త బౌలర్ షిరాజ్ టీమిండియాపై ప్రభావం చూపిస్తాడని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mohamed Shiraz receives his ODI debut cap for Sri Lanka! Congratulations and all the best for your journey with the national team. Make us proud! #SLvIND 🇱🇰🏏 pic.twitter.com/n59louQXNS
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 2, 2024