Nidhan
India vs Sri Lanka: సిరీస్ డిసైడర్‌గా మారిన మూడో వన్డేలో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. లంక జోరుకు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూ మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది.
India vs Sri Lanka: సిరీస్ డిసైడర్‌గా మారిన మూడో వన్డేలో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. లంక జోరుకు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూ మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది.
Nidhan
సిరీస్ డిసైడర్‌గా మారిన మూడో వన్డేలో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. లంక జోరుకు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూ మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు పతుమ్ నిస్సంక (65 బంతుల్లో 45), ఆవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96) సూపర్బ్ స్టార్ట్ అందించారు. ఇద్దరూ కలసి మొదటి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. ఆ తర్వాత నిస్సంక ఔట్ అయినా కీపర్ కుశాల్ మెండిస్ (82 బంతుల్లో 59)తో కలసి ఫెర్నాండో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే వీళ్లిద్దరూ తక్కువ వ్యవధిలో ఔట్ అవడం, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో లంక 248 పరుగులే చేయగలిగింది.
ఒకదశలో 171/1తో పటిష్టంగా ఉన్న శ్రీలంక ఈజీగా 300 చేస్తుందని అనిపించింది. కానీ ఆ టీమ్‌ను మన బౌలర్లు అడ్డుకున్నారు. ముఖ్యంగా అరంగేట్ర ఆటగాడు రియాన్ పరాగ్ (3/54) ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అవిష్కతో పాటు లంక కెప్టెన్ అసలంక (10)ను అతడే ఔట్ చేశాడు. గత రెండు వన్డేల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన దునిత్ వెల్లలాగే (2)ను కూడా పరాగ్ పెవిలియన్‌కు పంపాడు. ఆడిన తొలి వన్డేలోనే 3 వికెట్లతో సత్తా చాటాడతను. పరాగ్‌కు క్యాప్ ఇచ్చి టీమ్‌లోకి ఆహ్వానించిన విరాట్ కోహ్లీ అతడు వికెట్లు తీస్తుంటే ఆనందం పట్టలేకపోయాడు. తనదైన స్టైల్లో గాల్లో ఎగురుతూ, పంచ్‌లు విసురుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ టైమ్‌లో అతడ్ని చూస్తే తాను వికెట్ తీసినా ఇంతగా సంతోషపడడేమోనని అనిపించిందని ఫ్యాన్స్ అంటున్నారు.
Like Master, like Apprentice!
– Virat Kohli and Riyan Parag. 👌 pic.twitter.com/5Cawl931WP
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 7, 2024