IND vs SL Riyan Parag Debut Virat Kohli Reaction: పరాగ్​కు క్యాప్ ఇచ్చి టీమ్​లోకి ఆహ్వానించిన కోహ్లీ.. గుర్తుండిపోయేలా స్పీచ్!

Riyan Parag: పరాగ్​కు క్యాప్ ఇచ్చి టీమ్​లోకి ఆహ్వానించిన కోహ్లీ.. గుర్తుండిపోయేలా స్పీచ్!

Virat Kohli: టీమిండియా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేతో అతడు 50 ఓవర్ల ఫార్మాట్​లో డెబ్యూ ఇచ్చాడు.

Virat Kohli: టీమిండియా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేతో అతడు 50 ఓవర్ల ఫార్మాట్​లో డెబ్యూ ఇచ్చాడు.

టీమిండియా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేతో అతడు 50 ఓవర్ల ఫార్మాట్​లో డెబ్యూ ఇచ్చాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అతడికి క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు. అయితే టీమ్​లోకి ఆప్యాయంగా స్వాగతిస్తూనే స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. భారత్ తరఫున వన్డేల్లో ఆడే అవకాశం దక్కించుకున్నందుకు పరాగ్​కు కంగ్రాట్స్ చెప్పాడు కోహ్లీ. ఈ క్యాప్ ఎలా లభించింది? దీని విలువ ఏంటనేది గుర్తుంచుకోవాలన్నాడు. హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సిరీస్​కు ఎంపిక చేసిన సెలెక్టర్లు నీ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకో అంటూ పరాగ్​కు సూచించాడు కింగ్.

‘పరాగ్.. నీ మీద నాకు నమ్మకం ఉంది. మన టీమ్​మేట్స్ అందరికీ నీ సత్తా ఏంటో తెలుసు. నువ్వు జట్టులోకి రావడానికి ఇదే మంచి సమయం. ఇంటర్నేషనల్ కెరీర్​లో నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా సత్తా చాటుతావని.. ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చుతావని ఆశిస్తున్నా. నీకు ఆల్​ ది బెస్ట్’ అని కోహ్లీ చెప్పాడు. క్యాప్​ను పరాగ్ తల మీద పెట్టి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక, వన్డేల్లో తాజాగా డెబ్యూ ఇచ్చిన పరాగ్.. జింబాబ్వే సిరీస్​తో టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. మరి.. ఈ కుర్ర క్రికెటర్ భవిష్యత్తులో అద్భుతాలు చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments