Nidhan
Virat Kohli: టీమిండియా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేతో అతడు 50 ఓవర్ల ఫార్మాట్లో డెబ్యూ ఇచ్చాడు.
Virat Kohli: టీమిండియా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేతో అతడు 50 ఓవర్ల ఫార్మాట్లో డెబ్యూ ఇచ్చాడు.
Nidhan
టీమిండియా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేతో అతడు 50 ఓవర్ల ఫార్మాట్లో డెబ్యూ ఇచ్చాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అతడికి క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు. అయితే టీమ్‌లోకి ఆప్యాయంగా స్వాగతిస్తూనే స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. భారత్ తరఫున వన్డేల్లో ఆడే అవకాశం దక్కించుకున్నందుకు పరాగ్‌కు కంగ్రాట్స్ చెప్పాడు కోహ్లీ. ఈ క్యాప్ ఎలా లభించింది? దీని విలువ ఏంటనేది గుర్తుంచుకోవాలన్నాడు. హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సిరీస్‌కు ఎంపిక చేసిన సెలెక్టర్లు నీ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకో అంటూ పరాగ్‌కు సూచించాడు కింగ్.
‘పరాగ్.. నీ మీద నాకు నమ్మకం ఉంది. మన టీమ్మేట్స్ అందరికీ నీ సత్తా ఏంటో తెలుసు. నువ్వు జట్టులోకి రావడానికి ఇదే మంచి సమయం. ఇంటర్నేషనల్ కెరీర్లో నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా సత్తా చాటుతావని.. ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చుతావని ఆశిస్తున్నా. నీకు ఆల్ ది బెస్ట్’ అని కోహ్లీ చెప్పాడు. క్యాప్‌ను పరాగ్ తల మీద పెట్టి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక, వన్డేల్లో తాజాగా డెబ్యూ ఇచ్చిన పరాగ్.. జింబాబ్వే సిరీస్‌తో టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. మరి.. ఈ కుర్ర క్రికెటర్ భవిష్యత్తులో అద్భుతాలు చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Virat Kohli giving the cap to Riyan Parag!
– What a moment for Parag, getting the cap from his idol. 🐐🇮🇳 pic.twitter.com/h4VYkTbxgh
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 7, 2024