Nidhan
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ భారత్‌కు ఎప్పటికీ మర్చిపోని షాక్ ఇచ్చింది. స్టార్లతో నిండిన మన టీమ్‌ను ఆతిథ్య జట్టు ఇంత ఈజీగా ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ సిరీస్‌తో మైనస్‌లే కాదు.. కొన్ని ప్లస్ పాయింట్లూ ఉన్నాయి.
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ భారత్‌కు ఎప్పటికీ మర్చిపోని షాక్ ఇచ్చింది. స్టార్లతో నిండిన మన టీమ్‌ను ఆతిథ్య జట్టు ఇంత ఈజీగా ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ సిరీస్‌తో మైనస్‌లే కాదు.. కొన్ని ప్లస్ పాయింట్లూ ఉన్నాయి.
Nidhan
శ్రీలంక టూర్ భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది టీమిండియా. అదే ఊపులో వన్డే సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ను చేస్తుందని అంతా అనుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లంతా వన్డే టీమ్‌లోకి రావడంతో ఇక జట్టుకు తిరుగులేదు.. లంకను మడతబెట్టేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఆ టీమ్ క్లీన్‌స్వీప్ తప్పించుకుంటే అదే గొప్ప అని అనుకున్నారు. అయితే సీన్ కట్ చేస్తే.. సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది మెన్ ఇన్ బ్లూ. తొలి మ్యాచ్ టై అవగా.. మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించింది భారత్.
బ్యాటింగ్ ఫెయిల్యూర్, లంక కండీషన్స్‌కు అలవాటు పడకపోవడం, టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఉన్న వీక్నెస్, బౌలర్లు తమ రేంజ్‌కు తగ్గట్లు పెర్ఫార్మ్ చేయకపోవడం.. ఇలా రోహిత్ సేన పరాభవానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. స్టార్లతో నిండిన మన టీమ్‌ను ఆతిథ్య జట్టు ఇంతలా ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ సిరీస్‌తో మైనస్‌లే కాదు.. కొన్ని ప్లస్ పాయింట్లూ ఉన్నాయి. ఈ టూర్‌తో భారత్‌కు ఇద్దరు ఫ్యూచర్ స్టార్లు దొరికారు. వాళ్లే రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్. ఈ ఇద్దరు ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. అటు టీ20 సిరీస్‌లోనూ, ఇటు వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటారు.
టీ20 సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు పరాగ్. ఆ తర్వాతి మ్యాచుల్లో వికెట్లు తీయకపోయినా పరుగులు ఇవ్వకుండా లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. వన్డే సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో ఛాన్స్ రాగా.. అందులో 3 వికెట్లు తీసి తన స్పిన్ పవర్ చూపించాడు. బ్యాటింగ్‌లో మోస్తరుగా రాణించిన రియాన్‌కు భారీ ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా ఉంది. భవిష్యత్తులో అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదిగే ఛాన్స్ ఉంది. ఇక, సుందర్ టీ20 సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో 18 బంతుల్లో 25 పరుగులు చేశాడు. వన్డే సిరీస్‌లో రెండు మ్యాచుల్లో 4 వికెట్లు పడగొట్టడమే గాక బ్యాట్‌తోనూ రాణించాడు.
వన్డే సిరీస్‌లో అయ్యర్, సిరాజ్, పంత్ లాంటి కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. కానీ పరాగ్, సుందర్ రూపంలో ఇద్దరు టాలెంటెడ్ స్టార్లు దొరికారు. వీళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా కీలక పాత్ర పోషించేలా కనిపిస్తున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగలగడం, మంచి ఫీల్డర్లు కూడా కావడంతో వీళ్లు ఆల్రౌండర్లుగా జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది. కోచ్ గంభీర్ సానబెట్టి, ఛాన్సులు ఇవ్వాలే గానీ భారత క్రికెట్‌ను ఏళ్ల పాటు భుజాలపై మోస్తామనే నమ్మకాన్ని కల్పించారు. మరి.. పరాగ్-సుందర్ కెరీర్లో ఎక్కడి వరకు చేరుకుంటారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.