Ravi Bishnoi: లెజెండ్ కుంబ్లేను గుర్తుచేసిన రవి బిష్ణోయ్.. అతడి డెడికేషన్​కు హ్యాట్సాఫ్!

టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అందరి మనసులు దోచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టీ20లొ అతడు చేసిన సాహసం గురించి తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు.

టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అందరి మనసులు దోచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టీ20లొ అతడు చేసిన సాహసం గురించి తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు.

శ్రీలంక టూర్​ను టీమిండియా సక్సెస్​తో స్టార్ట్ చేసింది. శనివారం జరిగిన తొలి టీ20లో భారత్ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన మెన్ ఇన్ బ్లూ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40), శుబ్​మన్ గిల్ (16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్​లతో అదరగొట్టారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 58) కెప్టెన్సీ ఇన్నింగ్స్​తో చెలరేగిపోయాడు. ఆఖర్లో రిషబ్ పంత్ (33 బంతుల్లో 49) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులకు పరిమితమైంది.

టీమిండియా బౌలర్లలో అర్ష్​దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా.. రియాన్ పరాగ్ మూడు వికెట్లతో లంక నడ్డి విరిచాడు. కెప్టెన్సీ నాక్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన సూర్యకుమార్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే లంక ఇన్నింగ్స్​లో జరిగిన ఓ ఘటన మ్యాచ్​కే హైలైట్​గా మారింది. భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ వేస్తూ గాయాలపాలయ్యాడు. 16వ ఓవర్ వేసిన బిష్ణోయ్​కు ఇంజ్యురీ అయింది. ప్రత్యర్థి ఆటగాడు కమిందు మెండిస్ ఇచ్చిన క్యాచ్​ను అందుకునే ప్రయత్నంలో జంప్ చేశాడు బిష్ణోయ్. కానీ బాల్ చేతికి చిక్కలేదు. బంతిని అందుకునే ప్రయత్నంలో మిస్సవడంతో అతడు కిందపడ్డాడు. దీంతో అతడి​ కుడి చేతి మణికట్టుతో పాటు ముఖానికి గాయమైంది. అతడి చెంప మీద గీసుకుపోవడంతో ఆ భాగంలో రక్తస్రావం అయింది.

బిష్ణోయ్​ గాయాన్ని చూసి వెంటనే ఫిజియో గ్రౌండ్​లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వైద్యం అందిన తర్వాత బిష్ణోయ్ డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్లి రెస్ట్ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అతడు మాత్రం బౌలింగ్ కంటిన్యూ చేశాడు. అంతేగాక అదే ఓవర్​లో చరిత అసలంకను ఔట్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. దీంతో అందరూ అతడి డెడికేషన్​కు ఫిదా అయిపోయారు. గాయమైనా భయపడకుండా టీమ్​కు ఆడటం గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో లెజెండ్ అనిల్ కుంబ్లే వెస్టిండీస్​తో టెస్ట్​లో తలకు గాయమైనా బౌలింగ్ చేసి వికెట్లు తీసిన ఘటనను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. 2002లో జరిగిన ఆ టెస్ట్​లో బ్యాటింగ్​ టైమ్​లో హెల్మెట్​కు బాల్ తగలడంతో గాయపడిన కుంబ్లే.. ట్రీట్​మెంట్ చేయించుకొని తలకు పట్టీతోనే బౌలింగ్ చేశాడు. దీన్ని గుర్తుచేస్తూ.. ఇదే పట్టుదలతో ఆడితే కుంబ్లే స్థాయికి చేరుకుంటావని బిష్ణోయ్​ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్.

Show comments