iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: కోచ్​గా ఫస్ట్ మ్యాచ్​లో సూపర్ సక్సెస్.. అయినా గంభీర్​పై తప్పని ట్రోల్స్!

  • Published Jul 28, 2024 | 11:29 AM Updated Updated Jul 28, 2024 | 11:29 AM

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అనుకున్నది సాధించాడు. కోచ్​గా ఫస్ట్ అసైన్​మెంట్​లో గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. లంకతో జరిగిన తొలి టీ20లో భారత్ బంపర్ విక్టరీ కొట్టింది.

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అనుకున్నది సాధించాడు. కోచ్​గా ఫస్ట్ అసైన్​మెంట్​లో గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. లంకతో జరిగిన తొలి టీ20లో భారత్ బంపర్ విక్టరీ కొట్టింది.

  • Published Jul 28, 2024 | 11:29 AMUpdated Jul 28, 2024 | 11:29 AM
Gautam Gambhir: కోచ్​గా ఫస్ట్ మ్యాచ్​లో సూపర్ సక్సెస్.. అయినా గంభీర్​పై తప్పని ట్రోల్స్!

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అనుకున్నది సాధించాడు. కోచ్​గా ఫస్ట్ అసైన్​మెంట్​లో గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. లంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 43 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 58) విధ్వంసక బ్యాటింగ్​తో చెలరేగాడు. రిషబ్ పంత్ (33 బంతుల్లో 49), యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40) కూడా రాణించడంతో టీమ్ భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది.

పతుమ్ నిస్సంక (48 బంతుల్లో 79), కుశాల్ మెండిస్ (27 బంతుల్లో 45) పోరాడినా లంకను గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. టీమిండియా బౌలర్లలో అర్ష్​దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. రియాన్ పరాగ్ 3 వికెట్లతో లంకను కూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్​తో భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్​కు ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచ్​లో భారత్ ఘనవిజయం సాధించినా కొత్త కోచ్ గంభీర్​పై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్​ను టీమ్​లోకి తీసుకోకపోవడమే. గౌతీ మాట తప్పాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Gambhir

9 ఏళ్ల కింద టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంజూ ఇప్పటిదాకా 28 టీ20లే ఆడాడు. చాలా సిరీస్​ల్లో స్క్వాడ్​లో ఉన్నా అతడ్ని ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోలేదు. ఆ టైమ్​లో సంజూకు మద్దతుగా గంభీర్ పలు వ్యాఖ్యలు చేశాడు. ఇంత టాలెంట్ ఉన్న ప్లేయర్​ను బెంచ్ మీద కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఇండియాలోనే బెస్ట్ వికెట్ కీపర్, బెస్ట్ బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. కామెంట్రీ చేసినప్పుడు కూడా సంజూను ఎందుకు ఆడించట్లేదంటూ టీమ్ మేనేజ్​మెంట్​పై విమర్శలు చేశాడు. తీరా తాను కోచ్ అయ్యాక మాత్రం శాంసన్​ను టీమ్​లోకి తీసుకోలేదు. నిన్న లంకతో మ్యాచ్​లో సంజూను ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోలేదు. దీంతో అతడు మాట తప్పాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కోచ్ అయ్యాక మారిపోయాడంటూ విమర్శలు చేస్తున్నారు. ఎవరొచ్చినా సంజూ రాత మారట్లేదని వాపోతున్నారు. మరి.. సంజూను ఆడించకపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Epic Cricket Comments (@epic.cricket_comments)