iDreamPost
android-app
ios-app

భారత్​తో T20 సిరీస్​కు ముందు లంకకు మరో షాక్.. ఇలాగైతే వార్ వన్ సైడే!

  • Published Jul 25, 2024 | 5:04 PM Updated Updated Jul 25, 2024 | 5:04 PM

IND vs SL: టీమిండియాతో టీ20 సిరీస్​కు సన్నద్ధమవుతున్న శ్రీలంకకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మెన్ ఇన్ బ్లూకు ఆతిథ్య జట్టు కనీస పోటీ ఇవ్వడమూ కష్టమేలా ఉంది.

IND vs SL: టీమిండియాతో టీ20 సిరీస్​కు సన్నద్ధమవుతున్న శ్రీలంకకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మెన్ ఇన్ బ్లూకు ఆతిథ్య జట్టు కనీస పోటీ ఇవ్వడమూ కష్టమేలా ఉంది.

  • Published Jul 25, 2024 | 5:04 PMUpdated Jul 25, 2024 | 5:04 PM
భారత్​తో T20 సిరీస్​కు ముందు లంకకు మరో షాక్.. ఇలాగైతే వార్ వన్ సైడే!

జింబాబ్వే టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన కొన్నాళ్లకే మరో పర్యటనను మొదలుపెట్టింది టీమిండియా. మూడు టీ20లు, మూడు వన్డేల కోసం పొరుగు దేశం శ్రీలంకకు చేరుకుంది. కొత్త కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలో ఈ సిరీస్​ కోసం మెన్ ఇన్ బ్లూ ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​తో పాటు మిగిలిన ఆటగాళ్లంతా నెట్స్​లో చెమటోడ్చుతున్నారు. గంభీర్ ఒక్కో ప్లేయర్​ను కలుస్తూ వాళ్ల టెక్నిక్స్​ను సరిచేస్తూ ప్రాక్టీస్ సెషన్​ను నడిపిస్తున్నాడు. ఒకవైపు సిరీస్ కోసం భారత్ ముమ్మరంగా సాధన చేస్తుంటే.. మరోవైపు లంక శిబిరం మాత్రం ఆందోళనకరంగా మారింది. ఒక్క మ్యాచ్ కూడా మొదలవకుండానే ఆ టీమ్​కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

టీమిండియాతో టీ20 సిరీస్​కు ముందు శ్రీలంకకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ నువాన్ తుషార ఈ సిరీస్​కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఎడమ చేతి బొటన వేలుకు గాయమవడంతో నువాన్ ఈ సిరీస్​లో ఆడలేడని లంక బోర్డు తెలిపింది. అది బౌలింగ్ హ్యాండ్ కాకపోయినా గాయం తీవ్రత దృష్ట్యా అతడ్ని తప్పించామని తెలిపింది. ప్రాక్టీస్ సెషన్​లో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడికి ఇంజ్యురీ అయిందని పేర్కొంది. మెడికల్ రిపోర్ట్స్​లో బొటన వేలుకు ఫ్రాక్చర్ అయినట్లు తేలిందని లంక బోర్డు వెల్లడించింది.

నువాన్ తుషార స్థానంలో దిల్షాన్ మధుషంకను రీప్లేస్ చేసినట్లు లంక బోర్డు వివరించింది. దీంతో సిరీస్​ స్టార్ట్ అవడానికి ముందే ఆతిథ్య జట్టుకు రెండో షాక్ తగిలినట్లయింది. లంక ప్రధాన పేసర్ దుష్మంత చమీర బ్రాంకైటిస్​తో బాధపడుతుండటంతో సిరీస్​ నుంచి తప్పించారు. అతడి ప్లేస్​లో అసిత ఫెర్నాండోను రీప్లేస్ చేశారు. ఇది జరిగి ఒక రోజు కూడా కాకముందే నువాన్ తుషార రూపంలో లంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు కీలక బౌలర్లు దూరమవడంతో ఆ టీమ్ బౌలింగ్ అటాక్ బలహీనంగా కనిపిస్తోంది. భారత్​కు లంక కనీస పోటీ ఇవ్వడం కూడా కష్టంగానే అనిపిస్తోంది. ఆతిథ్య జట్టు ఆటగాళ్లు పట్టుదలతో ఆడితే తప్ప సిరీస్​లో వార్ వన్ సైడ్ అవడం ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.