Mateesha Pathirana: వీడియో: 151 కి.మీ.ల వేగంతో పతిరానా స్టన్నింగ్ యార్కర్.. బిత్తరపోయిన పాండ్యా!

India vs Sri Lanka: లంక ఎక్స్​ప్రెస్ పేసర్ మతీష పతిరానా ఓ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను షాకయ్యేలా చేశాడతను.

India vs Sri Lanka: లంక ఎక్స్​ప్రెస్ పేసర్ మతీష పతిరానా ఓ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను షాకయ్యేలా చేశాడతను.

శ్రీలంక ఎక్స్​ప్రెస్ పేసర్ మతీష పతిరానా ఓ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను షాకయ్యేలా చేశాడతను. భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు వచ్చిన పతిరానా నాలుగో బంతికి పాండ్యాను వెనక్కి పంపాడు. 151 కిలో మీటర్ల వేగంతో అతడు వేసిన ఆ బాల్ వికెట్లను చెల్లాచెదురు చేసింది. లెగ్ స్టంప్ మీద పడిన బంతిని ఫ్రంట్ ఫుట్​ను జరిపి ఆఫ్ సైడ్ రూమ్ క్రియేట్ చేసుకొని భారీ షాట్​గా మలుద్దామని హార్దిక్ ప్రయత్నించాడు. కానీ షాట్ ఆడటంలో ఆలస్యమవడంతో దూసుకొచ్చిన బంతి వికెట్లను గిరాటేసింది.

హార్దిక్ లేట్​గా ఆడటంతో అప్పటికే అతడ్ని దాటిన బంతి వెళ్లి వికెట్లను చెల్లాచెదురు చేసింది. ఆ దెబ్బకు బెయిల్స్ ఎగిరి దూరంగా పడ్డాయి. ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురైన పాండ్యా ఆ తర్వాత షాక్​ నుంచి కోలుకొని క్రీజును వీడాడు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ.. ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (58) కెప్టెన్సీ ఇన్నింగ్స్​తో మెరిశాడు. రిషబ్ పంత్ (49), యశస్వి జైస్వాల్ (40) కూడా రాణించారు. మరి.. పతిరానా స్పెషల్ యార్కర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments