Nidhan
India vs Sri Lanka: లంక ఎక్స్‌ప్రెస్ పేసర్ మతీష పతిరానా ఓ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను షాకయ్యేలా చేశాడతను.
India vs Sri Lanka: లంక ఎక్స్‌ప్రెస్ పేసర్ మతీష పతిరానా ఓ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను షాకయ్యేలా చేశాడతను.
Nidhan
శ్రీలంక ఎక్స్‌ప్రెస్ పేసర్ మతీష పతిరానా ఓ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను షాకయ్యేలా చేశాడతను. భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు వచ్చిన పతిరానా నాలుగో బంతికి పాండ్యాను వెనక్కి పంపాడు. 151 కిలో మీటర్ల వేగంతో అతడు వేసిన ఆ బాల్ వికెట్లను చెల్లాచెదురు చేసింది. లెగ్ స్టంప్ మీద పడిన బంతిని ఫ్రంట్ ఫుట్‌ను జరిపి ఆఫ్ సైడ్ రూమ్ క్రియేట్ చేసుకొని భారీ షాట్‌గా మలుద్దామని హార్దిక్ ప్రయత్నించాడు. కానీ షాట్ ఆడటంలో ఆలస్యమవడంతో దూసుకొచ్చిన బంతి వికెట్లను గిరాటేసింది.
హార్దిక్ లేట్‌గా ఆడటంతో అప్పటికే అతడ్ని దాటిన బంతి వెళ్లి వికెట్లను చెల్లాచెదురు చేసింది. ఆ దెబ్బకు బెయిల్స్ ఎగిరి దూరంగా పడ్డాయి. ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురైన పాండ్యా ఆ తర్వాత షాక్ నుంచి కోలుకొని క్రీజును వీడాడు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ.. ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (58) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. రిషబ్ పంత్ (49), యశస్వి జైస్వాల్ (40) కూడా రాణించారు. మరి.. పతిరానా స్పెషల్ యార్కర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Matheesha Pathirana dismisses Hardik Pandya for just 9⃣
📸: SonyLIV#SLvIND #HardikPandya #MatheeshaPathirana #CricketTwitter pic.twitter.com/6azBkT2xCl
— InsideSport (@InsideSportIND) July 27, 2024