IND vs SL Kamindu Mendis Bowling With Two Hands: ఒకే ఓవర్​లో రెండు చేతులతో బౌలింగ్ చేసిన లంక స్పిన్నర్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

Kamindu Mendis: ఒకే ఓవర్​లో రెండు చేతులతో బౌలింగ్ చేసిన లంక స్పిన్నర్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్​తో హైలైట్​గా నిలిచాడు.

India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్​తో హైలైట్​గా నిలిచాడు.

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్​తో హైలైట్​గా నిలిచాడు. సాధారణంగా ఏ బౌలర్ అయినా కుడి చేతితో బౌలింగ్ చేస్తారు లేదా ఎడమ చేతితో బౌలింగ్ చేస్తారు. కానీ ఈ మ్యాచ్​లో లంక స్పిన్నర్ కమిందు మెండిస్ మాత్రం రెండు చేతులతో బంతులు వేసి అందర్నీ విస్మయానికి గురిచేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసేందుకు వచ్చిన మెండిస్.. ఇద్దరు బ్యాటర్లను తికమక పెట్టాడు. సూర్యకుమార్ యాదవ్​కు లెఫ్టాండ్​తో బౌలింగ్ చేసిన కమిందు మెండిస్.. రిషబ్ పంత్​కు మాత్రం రైట్ హ్యాండ్​తో బౌలింగ్ చేశాడు.

సాధారణంగా కుడి చేతి వాటం బ్యాటర్లను ఎడమ చేతి స్పిన్నర్లు ఇబ్బంది పెడుతుంటారు. అదే సమయంలో ఎడమ చేతి బ్యాటర్లను కుడి చేతి వాటం బౌలర్లు చికాకు పెడతారు. అందుకే సూర్య కోసం లెఫ్టాండ్​తో బౌలింగ్ చేస్తూ బంతుల్ని బయటకు తీసుకెళ్లిన మెండిస్.. పంత్​కు కూడా అలాగే బౌలింగ్ చేసి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. కమిందు బౌలింగ్ చూసిన నెటిజన్స్ ఇలా రెండు చేతులతో బౌలింగ్ చేయడం కరెక్టేనా అని అనుమానిస్తున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇది సరైనదే. నిబంధనల ప్రకారం బౌలర్ ఏ చేతితోనైనా బౌలింగ్ చేయొచ్చు, ఇందులో తప్పేమీ లేదు. అయితే బంతి వేసే ముందు అంపైర్​కు సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఈ విషయం బ్యాటర్​కు చెబుతాడు అంపైర్. ఇలా బౌలింగ్ చేసే టాలెంట్ చాలా అరుదు. మరి.. కమిందు మెండిస్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments