iDreamPost
android-app
ios-app

Hardik Pandya: గెలిపిస్తే సరిపోదు.. టీమ్​లో ఉండాలంటే హార్దిక్ ఆ పని చేయాలి: రవిశాస్త్రి

  • Published Jul 29, 2024 | 4:45 PM Updated Updated Jul 29, 2024 | 4:45 PM

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మంచి ఫామ్​లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో అద్భుత ప్రదర్శనతో హీరోగా మారిన పాండ్యా.. లంక సిరీస్​లోనూ తన తడాఖా చూపిస్తున్నాడు.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మంచి ఫామ్​లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో అద్భుత ప్రదర్శనతో హీరోగా మారిన పాండ్యా.. లంక సిరీస్​లోనూ తన తడాఖా చూపిస్తున్నాడు.

  • Published Jul 29, 2024 | 4:45 PMUpdated Jul 29, 2024 | 4:45 PM
Hardik Pandya: గెలిపిస్తే సరిపోదు.. టీమ్​లో ఉండాలంటే హార్దిక్ ఆ పని చేయాలి: రవిశాస్త్రి

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మంచి ఫామ్​లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో అద్భుత ఆటతీరుతో హీరోగా మారిన పాండ్యా.. లంక సిరీస్​లోనూ తన తడాఖా చూపిస్తున్నాడు. మొదటి టీ20లో అంతగా రాణించకపోయినా.. రెండో మ్యాచ్​లో మాత్రం అదరగొట్టాడు. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. మంచి ఊపు మీద ఉన్న కుశాల్ పెరీరా (53), కమిందు మెండిస్ (26)ను పెవిలియన్​కు చేర్చాడు. ఆ తర్వాత ఛేజింగ్​లో ఒత్తిడి మధ్య క్రీజులోకి వచ్చి 9 బంతుల్లో 22 పరుగులతో మ్యాచ్​ను ముగించాడు. అయితే ఇంత బాగా ఆడుతున్న హార్దిక్​ను కేవలం టీ20లకే పరిమితం చేశారు.

ఫిట్​నెస్ ఇష్యూస్ కారణంగా చూసి హార్దిక్​కు బదులు సూర్యకుమార్​కు టీ20 కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చిన సెలెక్టర్లు.. అతడ్ని లంకతో వన్డే సిరీస్​కు కూడా ఎంపిక చేయలేదు. బ్యాటింగ్ ఓకే గానీ.. 50 ఓవర్ల ఫార్మాట్​లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసే ఫిట్​నెస్​ హార్దిక్​కు లేదని నేరుగా చెప్పారు. దులీప్ ట్రోఫీలో ఆడి ఫిట్​నెస్ ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వన్డే టీమ్​లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో లంకతో టీ20ల్లో కసిగా ఆడుతున్నాడు పాండ్యా. ఈ తరుణంలో అతడ్ని ఉద్దేశించి భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గెలిపిస్తే సరిపోదని.. వన్డే టీమ్​లోకి రావాలంటే ముందు ఫిట్​నెస్ నిరూపించుకోక తప్పదని అన్నాడు.

‘ఆటగాళ్లకు మ్యాచ్ ఫిట్​నెస్​ ఉండటం ఎంతో ముఖ్యమని నేను నమ్ముతా. అందుకే హార్దిక్ పాండ్యా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్​లు ఆడాలి. ప్రతి టీ20 మ్యాచ్​లో అతడు పాల్గొనాలి. ఒకవేళ తాను ఫిట్​గా ఉన్నానని అతడు భావిస్తే వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే వన్డేల్లో బౌలర్ 10 ఓవర్లు వేయాలని టీమ్ మేనేజ్​మెంట్​ ఆశిస్తుంది. కానీ మూడ్నాలుగు ఓవర్లు వేస్తే ఎవ్వరూ ఊరుకోరు. కాబట్టి పాండ్యా ఫిట్​నెస్​పై ఫోకస్ పెట్టాలి. కనీసం 8 ఓవర్లు వేయగలనని భావించినప్పుడు రీఎంట్రీ కోసం ప్రయత్నించాలి’ అని రవిశాస్త్రి సూచించాడు. వన్డే టీమ్​లో ఉండాలంటే అతడు ఫిట్​నెస్​ను మెరుగుపర్చుకోక తప్పదని, కనీసం 8 ఓవర్లు వేయాల్సిందేనని స్పష్టం చేశాడు. మరి.. పాండ్యా వన్డేల్లోకి ఎప్పటిలోగా రీఎంట్రీ ఇస్తాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.