Nidhan
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ న్యూ జర్నీని స్టార్ట్ చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టీ20తో సారథిగా నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ న్యూ జర్నీని స్టార్ట్ చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టీ20తో సారథిగా నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
Nidhan
టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ న్యూ జర్నీని స్టార్ట్ చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టీ20తో సారథిగా నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉందన్న స్కై.. అక్కడితో అయిపోలేదన్నాడు. తమ అసలు ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అయిందన్నాడు. పొట్టి ప్రపంచ కప్ అనేది ఇప్పుడు గతించిన విషయమని.. అదో చరిత్ర అన్నాడు సూర్యకుమార్.
టీ20 వరల్డ్ కప్ నుంచి బయటకొచ్చి ఇప్పుడు భారత జట్టును మళ్లీ నిర్మించడం మీద ఫోకస్ పెట్టామన్నాడు సూర్య. స్క్రాచ్ నుంచి అంతా షురూ చేస్తున్నామని తెలిపాడు. ఇది తమకు రియల్ ఛాలెంజ్ అని పేర్కొన్నాడు. యంగ్ ప్లేయర్లతో కూడిన టీమ్‌ను టాప్ లెవల్‌కు చేర్చడమే తమ టార్గెట్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంతా స్క్రాచ్ నుంచి మొదలుపెడుతున్నామని.. కొత్త టీమ్‌ను బిల్డ్ చేయడమే తమ టార్గెట్ అన్నాడు సూర్య. మరి.. టీ20 కెప్టెన్‌గా స్కై సక్సెస్ అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Suryakumar Yadav said – “The T20 World Cup 2024 is now History, we start from scratch and it is a new challenge”. pic.twitter.com/tZkPPrhvhg
— Tanuj Singh (@ImTanujSingh) July 27, 2024