iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: గంభీర్​కు కొత్త టెన్షన్! లంక ఇచ్చిన షాక్​తో డైలమాలో భారత కోచ్!

  • Published Aug 03, 2024 | 5:18 PM Updated Updated Aug 03, 2024 | 5:18 PM

ఒక్క మ్యాచ్​తో టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ డైలమాలో పడ్డాడు. శ్రీలంక ఇచ్చిన షాక్ నుంచి అతడు కోలుకోవడానికి టైమ్ పట్టేలా ఉంది. అయితే ఈ నయా టెన్షన్​ నుంచి అతడు త్వరగా బయటపడాలి.

ఒక్క మ్యాచ్​తో టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ డైలమాలో పడ్డాడు. శ్రీలంక ఇచ్చిన షాక్ నుంచి అతడు కోలుకోవడానికి టైమ్ పట్టేలా ఉంది. అయితే ఈ నయా టెన్షన్​ నుంచి అతడు త్వరగా బయటపడాలి.

  • Published Aug 03, 2024 | 5:18 PMUpdated Aug 03, 2024 | 5:18 PM
Gautam Gambhir: గంభీర్​కు కొత్త టెన్షన్! లంక ఇచ్చిన షాక్​తో డైలమాలో భారత కోచ్!

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​తో భారత కోచ్​గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు లెజెండ్ గౌతం గంభీర్. ఆ సిరీస్​లో ఆతిథ్య జట్టు నుంచి తీవ్ర పోటీ ఎదురైనా టీమిండియా దాన్ని తట్టుకొని వరుస విజయాలు సాధించింది. మూడు టీ20ల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది. దీంతో వన్డే సిరీస్​లో కూడా లంకను వైట్​వాష్ చేయడం పక్కా అని అంతా అనుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వన్డే స్పెషలిస్ట్​లు, టాప్ ప్లేయర్లు టీమ్​లో ఉండటంతో ఆతిథ్య జట్టును చిత్తు చేయడం పెద్ద మ్యాటర్ కాదని భావించారు. కానీ కుర్రాళ్లతో నిండిన లంక పట్టుదలతో ఆడి తొలి మ్యాచ్​లోనే భారత్​కు షాక్ ఇచ్చింది. ఓటమి కోరల్లో నుంచి బయటపడి మ్యాచ్​ను టై చేసింది.

లంక ఈ రేంజ్​లో పోరాడుతుందని, పట్టు వదలకుండా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. స్టార్ ప్లేయర్లతో నిండిన టీమిండియాను భయపెడుతుందని అస్సలు ఎక్స్​పెక్ట్ చేయలేదు. ఈ మ్యాచ్​ రిజల్ట్​తో కొత్త కోచ్​ గౌతం గంభీర్​లో నయా టెన్షన్ మొదలైంది. చేతుల్లో ఉన్న మ్యాచ్​ జారిపోవడంతో అతడు సీరియస్​గా ఉన్నాడు. లంక లాంటి టీమ్​పై టై అంటే అది నైతికంగా ఓటమితోనే సమానమని గౌతీకి తెలుసు. అందుకే భారత ప్రదర్శనపై, బ్యాటర్ల ఫెయిల్యూర్​ మీద అతడు గుర్రుగా ఉన్నాడు. అదే సమయంలో అతడ్ని ఓ టెన్షన్ పట్టుకుంది. టీ20 సిరీస్​లో చేసిన ప్రయోగం ఇక్కడ బెడిసికొట్టడంతో కొత్త కోచ్ తల పట్టుకుంటున్నాడు.

కోచ్ గంభీర్ సలహాతో నిన్న మ్యాచ్​లో శ్రీలంక ఇన్నింగ్స్​ టైమ్​లో వైస్ కెప్టెన్​ శుబ్​మన్ గిల్​కు ఓ ఓవర్ బౌలింగ్ చేయమని ఇచ్చాడు రోహిత్. అయితే ఆ ఓవర్​లో ఏకంగా 14 పరుగులు ఇచ్చుకున్నాడు గిల్. టీ20 సిరీస్​లో బ్యాటర్లు రియాన్ పరాగ్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ బౌలింగ్​లో కూడా సక్సెస్ అయ్యారు. ఆ ప్రయోగంలో భాగంగానే గిల్​తో బౌలింగ్ వేయిస్తే అతడు ఫ్లాప్ అయ్యాడు. దీంతో మళ్లీ అతడ్ని బౌలింగ్​కు దింపలేదు. అంతా రెగ్యులర్ బౌలర్లనే వాడాడు హిట్​మ్యాన్. ఈ దెబ్బతో శివమ్ దూబేతోనూ ఎక్కువగా బౌలింగ్ చేయించలేదు. అయితే ఆరో బౌలర్ లేని లోటును భర్తీ చేయాలంటే బ్యాటింగ్ ఆల్​రౌండర్స్​తో పాటు చేయి తిప్పి మూడ్నాలుగు ఓవర్లు వేసే బ్యాటర్లను వినియోగించుకోవాలి. లంక షాక్ ఇచ్చిందని గౌతీ ఈ ప్రయోగాన్ని ఆపేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నమెంట్స్​లో మనకు ముప్పు తప్పదని ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ సవాల్​ను దాటితే సక్సెస్ మనదేనని భరోసా ఇస్తున్నారు.