పట్టుమని పాతిక మ్యాచ్‌ల అనుభవం లేని కుర్రాడు.. టీమిండియానే డామినేట్‌ చేశాడు!

India vs Sri Lanka: టీ20 సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్​ను కూడా అదే విధంగా గెలుచుకుందామని అనుకుంది. కానీ తొలి వన్డేలోనే ఆతిథ్య శ్రీలంక మన జట్టుకు షాక్ ఇచ్చింది.

India vs Sri Lanka: టీ20 సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్​ను కూడా అదే విధంగా గెలుచుకుందామని అనుకుంది. కానీ తొలి వన్డేలోనే ఆతిథ్య శ్రీలంక మన జట్టుకు షాక్ ఇచ్చింది.

శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్​ను కూడా అదే విధంగా గెలుచుకుందామని అనుకుంది. మరోమారు లంకను ఓ పట్టు పడదామని భావించింది. ఈ సిరీస్​లో కూడా ఆతిథ్య జట్టును వైట్​వాష్ చేయాలని డిసైడ్ అయింది. అయితే తొలి వన్డేలోనే లంక మన జట్టుకు షాక్ ఇచ్చింది. కొలంబో వేదికగా జరిగిన హై టెన్షన్ మ్యాచ్ టై అయింది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్​లో రెండు జట్ల మధ్య విజయం చివరి వరకు దోబూచులాడుతూ వచ్చింది. చివరి వరకు పట్టు వదలకుండా పోరాడిన లంక మ్యాచ్​ను టై చేసి.. నైతికంగా భారత్​పై విజయం సాధించింది. చేతిలోని మ్యాచ్​ జారిపోవడానికి టీమిండియా బ్యాటర్ల ఫెయిల్యూర్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు మంచి స్టార్ట్స్ లభించాక కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వీళ్లలో ఏ ఒక్కరు ఆఖరి వరకు ఉన్నా మ్యాచ్​ను అలవోకగా ముగించేవారు. అక్షర్ పటేల్, శివమ్ దూబె కీలక సమయంలో ఔట్ అవడం, టెయిలెండర్ అర్ష్​దీప్ సింగిల్ కోసం కాకుండా భారీ షాట్​తో మ్యాచ్​ను ముగించాలనుకోవడం టీమిండియా కొంప ముంచిందని చెప్పొచ్చు. అయితే టైకి అసలు కారణం మాత్రం ఓ లంక ఆటగాడి సాహసోపేత ఇన్నింగ్సే. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఆ కుర్రాడు డేరింగ్ బ్యాటింగ్​తో టీమిండియాను డామినేట్ చేశాడు. 150 స్కోరు కూడా దాటడం కష్టమే అనుకున్న తమ టీమ్​ను 230కి చేర్చాడు. అతడే దునిత్ వెల్లలాగే.

నిన్న మ్యాచ్​లో శ్రీలంక బ్యాటింగ్ టైమ్​లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చాడు యంగ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే. పిచ్​ నుంచి టర్న్ అభిస్తుండటంతో భారత స్నిన్నర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నారు. అయినా వెల్లలాగే సంయమనంతో కూల్​గా బ్యాటింగ్ చేశాడు. లియానాగె (20), వనిందు హసరంగ (24), అకిల ధనంజయ (17)తో కలసి ఇన్నింగ్స్​ను బిల్డ్ చేశాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న వెల్లలాగే 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 67 పరుగులు చేశాడు. అతడ్ని ఔట్ చేయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను ఎంత మార్చినా ఫలితం లేకుండా పోయింది.

పట్టుదలతో బ్యాటింగ్ చేసిన వెల్లలాగే సింగ్స్, డబుల్స్ తీస్తూ.. కుదిరినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తాను ఆడటమే గాక ఇతర బ్యాటర్లకూ సపోర్ట్​గా నిలిచాడు. అతడే గనుక ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే లంక ఎప్పుడో కుప్పకూలేది. ఆ తర్వాత బౌలింగ్​లో 9 ఓవర్లు వేసి 2 వికెట్లు పడగొట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే అసలంక వేసిన ఓవర్ కాదు.. వెల్లలాగే ఆడిన ఇన్నింగ్సే మ్యాచ్​కు టర్నింగ్ పాయింట్​గా మారింది. ఈ యంగ్ ప్లేయర్ భారత్ మీద చెలరేగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఆసియా కప్-2023​లో డెబ్యూ ఇచ్చిన వెల్లలాగే.. రోహిత్, గిల్, కోహ్లీ, రాహుల్, పాండ్యాను ఔట్ చేసి అప్పట్లో టీమిండియాకు షాక్ ఇచ్చాడు. నిన్న మళ్లీ అదే రీతిలో మెప్పించాడు. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో ఈసారి ఐపీఎల్​లో హాట్​ కేక్​గా మారాడు. మరి.. వెల్లలాగే ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments