SNP
Charith Asalanka, IND vs SL, Arshdeep Singh: గెలవాల్సిన మ్యాచ్‌లో ఒక్క పరుగు చేయకుండా టీమిండియా మ్యాచ్‌ను టై చేసుకుంది. మ్యాచ్ అలా టై అవ్వడానికి కారణం ఒకే ఒక్కడు అతని పేరు.. అసలంకా. ఇతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Charith Asalanka, IND vs SL, Arshdeep Singh: గెలవాల్సిన మ్యాచ్‌లో ఒక్క పరుగు చేయకుండా టీమిండియా మ్యాచ్‌ను టై చేసుకుంది. మ్యాచ్ అలా టై అవ్వడానికి కారణం ఒకే ఒక్కడు అతని పేరు.. అసలంకా. ఇతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియాతో జరిగిన తొలి వన్డేను టై చేసుకుంది శ్రీలంక. మూడు టీ20ల సిరీస్‌ను 0-3తో ఓడిన తర్వాత.. ఈ మ్యాచ్ లంకకు మంచి బూస్ట్ ఇచ్చింది. మ్యాచ్ గెలవకపోయినా.. ఓడిపోయే మ్యాచ్‌ను టై చేసుకోవడం అంటే దాదాపు గెలిచినట్టే లెక్క. ఆ విషయం టీమిండియా క్రికెట్ అభిమానులకు కూడా తెలుసు. శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ టై అయిన తర్వాత.. శ్రీలంక క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకుంటే.. భారత క్రికెటర్లు, భారత క్రికెట్ అభిమానులు నిరాశలో కల్పించారు. ఎందుకంటే.. ఆ మ్యాచ్‌ను టీమిండియా సులువుగా గెలవాలి.
టీమిండియా విజయానికి చివరి 15 బంతుల్లో కేవలం ఒక్క రన్ మాత్రమే అవసరం.. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి, స్ట్రైక్‌లో శివమ్ దూబే లాంటి మంచి బ్యాటర్ ఉన్నాడు.. అయినా కూడా టీమిండియా మ్యాచ్ గెలవలేకపోయిది. ఓడిపోయే మ్యాచ్‌ను లంక డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ టై అవ్వడానికి ప్రధాన కారణం.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకా. అప్పటికే స్కోర్స్ ఈక్వల్ అయిన తర్వాత.. టీమిండియా విజయానికి ఒక్క రన్ మాత్రమే అవసరమైన సమయంలో కూడా ఆశలు వదులుకోకుండా.. పట్టుదలతో అద్భుతమైన బౌలింగ్‌తో.. శివమ్ దూబే, అర్షదీప్ సింగ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి.. లంకను ఓటమి నుంచి రక్షించాడు. ఇంత అద్భుతమైన బౌలింగ్ వేసిన అసలంకా అంత గొప్ప బౌలరా? అంటే అదీ కాదు.
చరిత్ అసలంకా.. శుక్రవారం ఇండియాతో జరిగిన తొలి వన్డేలో 8.5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ స్టాట్స్ చూసి.. అతనో పెద్ద స్పిన్ బౌలర్ అని అనుకుంటే పొరపాటే. అసలంకా ఒక మిడిల్డార్ బ్యాటర్. అప్పుడప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్‌గా మాత్రమే బౌలింగ్ చేస్తాడు. ఇటీవలె టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌తోనే శ్రీలంక జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అయితే.. శుక్రవారం కొలంబో పిచ్ స్లోగా ఉండి, స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. చాలా ఎఫెక్టీవ్‌గా బౌలింగ్ చేయడమే కాకుండా.. ఓడిపోయే మ్యాచ్‌ను టై చేసి.. లంకను ఓటమి నుంచి రక్షించాడు. ఇన్నింగ్స్ 48వ ఓవర్ నాలుగో బంతికి శివమ్ దూబేను, ఐదో బంతికి అర్షదీప్ సింగ్‌ను అవుట్ చేసి.. 230 పరుగుల వద్ద ఇండియాను ఆలౌట్ చేశాడు. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అసలంకా.. వన్డేల్లో ఒక 8 వికెట్లు సాధించాడు. టెస్టు, టీ20ల్లో అతనికి వికెట్లు లేవు. పెద్దగా బౌలింగ్ కూడా చేయలేదు. టెస్టుల్లో 25, టీ20ల్లో 37, వన్డేల్లో 249 బంతులు మాత్రమే వేశాడు. ఇలాంటి బౌలర్‌ను ఎదుర్కొలేక టీమిండియా గెలిచే మ్యాచ్‌ను టైగా ముగించింది. మరి అసలంకా బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A night to remember for Charith Asalanka with the ball 🔥
Axar Patel – OUT
Shivam Dube – OUT
Arshdeep Singh – OUT
“WHY DID ARSHDEEP SINGH DO THAT” #INDvsSL pic.twitter.com/wcdW8eKT9W— Ashok Choudhary (@Bhaduashokk) August 2, 2024