శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు. అయితే ముగ్గురు ప్లేయర్లు మాత్రం సెంచరీలు చేసే ఛాన్స్‌ను మిస్సయ్యారు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు. అయితే ముగ్గురు ప్లేయర్లు మాత్రం సెంచరీలు చేసే ఛాన్స్‌ను మిస్సయ్యారు.
వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టీమ్ అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఆడి ఔటయ్యాడు హిట్‌మ్యాన్. దీంతో టీమిండియా కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. కానీ మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (92)తో కలసి విరాట్ కోహ్లీ (88) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన ఈ జోడీ.. ఆ తర్వాత బౌండరీల బౌండరీలు కొట్టారు. వీళ్లిద్దరూ కలసి రెండో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే సెంచరీకి చేరువలో గిల్ ఔటయ్యాడు.
గిల్ ఔటైన కాసేపటికే కోహ్లీ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికి ఇంకా చాలా ఓవర్లు ఉన్నప్పటికీ గిల్, కోహ్లీలు సెంచరీ మార్క్‌ను చేరకుండానే ఔటవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (21), సూర్యకుమార్ యాదవ్ (12) మంచి స్టార్ట్స్‌ను భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయారు. అయితే శ్రేయస్ అయ్యర్ (82) మాత్రం అదరగొట్టాడు. 56 బంతుల్లో 82 రన్స్ చేసిన అయ్యర్ ఏకంగా 3 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. అతడు కొట్టిన ఒక షాట్ అయితే ఏకంగా 106 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. మెగా టోర్నీలో అదే బిగ్గెస్ట్ సిక్సర్ కావడం విశేషం.
అయ్యర్ కూడా సెంచరీకి దగ్గరగా వచ్చి ఔటయ్యాడు. శ్రేయస్ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (35) మాత్రం ఆఖరి వరకు ఉన్నాడు. టీమిండియా భారీ స్కోరు చేసినప్పటికీ ఈ మ్యాచ్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు సెంచరీలు మిస్ చేసుకోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. అయితే సెంచరీలు చేసే ఛాన్స్‌ను కోల్పోయిన గిల్, కోహ్లీ, అయ్యర్‌లను ఒకే బౌలర్ ఔట్ చేయడం గమనార్హం. లంక పేసర్ దిల్షాన్ మదుశంక ఈ ముగ్గురూ సెంచరీలు చేయకుండా అడ్డుకున్నాడు. అయితే ఇందులో అతడి బౌలింగ్ గొప్పదనమేమీ లేదు. మన బ్యాటర్లే అనవసరంగా రాంగ్ షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. మొత్తానికి భారత టాపార్డర్ వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు మదుశంక. మరి.. ముగ్గురు భారత బ్యాటర్లు సెంచరీలు మిస్ చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్‌పై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మిగతావాళ్ల కంటే స్పెషల్ అంటూ..!
5 Wicket Haul for Dilshan Madushanka#INDvSL #ODIWorldCup2023 #ICCWorldCup2023 #INDvsSL pic.twitter.com/uaP2h11vvH
— RVCJ Media (@RVCJ_FB) November 2, 2023