Nidhan
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమితో బాధలో ఉన్న టీమిండియాకు ఒకదాని వెంట మరొకటి బిగ్ షాక్స్ తగులుతున్నాయి. వీటి నుంచి టీమ్ ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమితో బాధలో ఉన్న టీమిండియాకు ఒకదాని వెంట మరొకటి బిగ్ షాక్స్ తగులుతున్నాయి. వీటి నుంచి టీమ్ ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
Nidhan
సౌతాఫ్రికా గడ్డ మీద టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న టీమిండియా ఆశలకు మరోమారు గండి పడింది. 31 ఏళ్లలో ఫస్ట్ టైమ్ సిరీస్ గెలుస్తుందేమో అనుకుంటే ఈసారి కూడా నిరాశ తప్పలేదు. హిస్టరీలో మార్పేమీ లేదు. సఫారీ గడ్డపై కాన్ఫిడెన్స్‌తో ఆడలేని బలహీనత మరోమారు కంటిన్యూ అయింది. వెన్నులో వణుకు పుట్టించే పేస్, భయపెట్టే ఎక్స్ట్రా బౌన్స్‌ను హ్యాండిల్ చేయలేకపోవడం, సరైన ప్రిపరేషన్స్ లేకుండానే గ్రౌండ్లోకి దిగడం వెరసి సెంచూరియన్ టెస్ట్‌లో భారత జట్టుకు ఘోర పరాభవం. మూడ్రోజుల్లోనే తొలి టెస్ట్ ముగిసింది. బ్యాట్స్‌మెన్ కనీసం ఫైట్ చేయకుండానే చేతులెత్తేయడంతో ఫస్ట్ టెస్ట్‌లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్లో భారత్ ఫస్ట్ ప్లేస్‌ను కోల్పోయింది.
సౌతాఫ్రికాతో మొదటి టెస్టులో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా.. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానానికి దిగజారింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 66.67 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉండేది. కానీ ఒక్క ఓటమితో 44.4 పాయింట్లకు తగ్గి.. ఐదో స్థానానికి పడిపోయింది. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ మరో మరో రెండు పాయింట్ల కోత విధించడంతో టీమిండియా (38.89) పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది. ఈ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించిన ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు 100 పాయింట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్కు చేరుకుంది. ప్రొటీస్ తర్వాతి పొజిషన్స్‌లో పాకిస్థాన్ (61.11), న్యూజిలాండ్ (50.0) టీమ్స్ కొనసాగుతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమితో పాయింట్ల టేబుల్లో వెనకబడటమే కాదు.. భారత్‌కు ఇంకో భారీ షాక్ కూడా తగిలింది. ఫస్ట్ టెస్ట్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోత పడింది.
సెంచూరియన్ టెస్ట్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. రెండో పాయింట్ల కోత విధించిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులోనూ జరిమానా వేసింది. అసలే ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లకు ఇది మింగుడు పడటం లేదు. ఒక్క పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ఆరో స్థానానికి పడిపోవడం, స్లో ఓవర్ రేట్, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ఫెయిల్యూర్.. ఇలా ఒక్కసారిగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందు అనేక సమస్యలు వచ్చిపడ్డట్లయింది. వాళ్లు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కావాలంటే ప్రతి టెస్ట్, ప్రతి సిరీస్ అన్ని టీమ్స్‌కు కీలకంగా మారాయి. ఇలాంటి తరుణంలో ఘోర ఓటమి ఎదురవ్వడం రోహిత్-ద్రవిడ్‌ను ఇబ్బంది పెట్టే అంశమే. దీని నుంచి టీమిండియా ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలి. మరి.. ఓటమి బాధలో ఉన్న భారత్‌కు ఒకదాని వెంట మరో భారీ షాక్ తగలడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చెత్త బౌలర్ల లిస్ట్‌లో నంబర్ 2గా ప్రసిద్ధ్ కృష్ణ! నెం.1 ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
🚨 India has been docked 2 points on the WTC table and fined 10% of the match fees for not keeping up with the required overrate. pic.twitter.com/npYk9E0IXZ
— CricketGully (@thecricketgully) December 29, 2023